రాహుల్ వర్కౌట్లకు అతియా అదిరిపోయే రెస్పాన్స్..  

26 May, 2021 17:55 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ ఓపెనర్ కేఎల్ రాహుల్..  ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా అపెండిసైటిస్‌తో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇటీవలే కోలుకుని తేలికపాటి కసరత్తులు ప్రారంభించాడు. ఈ సందర్బంగా తాను తీసుకున్న కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కెటిల్‌ బాల్‌తో తేలికపాటి కసరత్తులు చేస్తున్న చిత్రంతో  పాటు సేదతీరుతున్న క్యాండిడ్‌ చిత్రాలను షేర్ చేస్తూ..  And still, We Rise అనే క్యాప్షన్‌ ను జోడించాడు. 

ఈ పోస్ట్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. గంటల వ్యవధిలో వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. అయితే రాహుల్ పోస్ట్ కు అతని అంతరంగ స్నేహితురాలు అతియా శెట్టి పెట్టిన కామెంట్‌ నెటిజన్లను ప్రత్యేకంగా ఆకర్షింది. ఆమె మరీ భిన్నంగా రెస్పాండ్ కాలేదు, కేవలం స్మైలీ ఏమోజీ పెట్టి వదిలేసింది. అయినప్పటికీ ఈ కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా, బాలీవుడ్‌ నటి అతియా శెట్టితో రాహుల్ ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ  బాహటంగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగినా.. తమ మధ్య ప్రేమ వ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 

అయితే తాజాగా రాహుల్ పెట్టిన పోస్ట్‌కు అతియా స్పందించడంతో వీరి ప్రేమ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ లో పర్యటించాల్సిన భారత జట్టులో కే ఎల్ రాహుల్ సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియాతో పాటు అతను కూడా లండన్ ఫ్లైట్ ఎక్కాలంటే ఫిట్ నెస్ పరీక్షలో పాస్ కావాల్సి ఉంది. భారత  జట్టు ఇంగ్లండ్  పర్యటనలో డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు రూట్ సేనతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. 
చదవండి: WTC FINAL: డ్రా అయితే ఆరో రోజు కూడా..?

 

మరిన్ని వార్తలు