పాండ్యా కొడుక్కి రాహుల్‌ సలహా.. వైరల్‌

8 Aug, 2020 14:49 IST|Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యా ఇటీవల తండ్రి అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పుత్రోత్సాహంతో మురిసిపోతున్నాడు. బుడ్డొడి ఫోటోలు సోషల్‌ మీడియాతో పంచుకుంటూ తన ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఇక హర్థిక్‌ సోదరుడు క్రునాల్‌ పాండ్యా సైతం చిన్నారితో కలిసి ఉన్న ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటున్నాడు. శుక్రవారం తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో బుడ్డోడితో కలిసిన ఉన్న ఓ జిఫ్‌ను పోస్ట్‌ చేస్తూ.. ‘క్రికెట్‌ గురించి మాట్లాడు’అని క్యాప్షన్‌ ఇచ్చాడు. (చదవండి: ప్రభుత్వం ఆడుకోమంది..! )

ఇక పాండ్యా పెట్టిన పోస్ట్‌కు  స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తనదైన స్టైల్‌లో స్పందింస్తూ ‘బుడ్డ పాండ్యా’కు ఓ సలహా కూడా ఇచ్చాడు. ‘పాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కావాలని దయచేసి అతనికి చెప్పు’అని కామెంట్‌ పెట్టాడు. ప్రస్తుతం రాహుల్‌ కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
(చదవండి : మన్‌ప్రీత్‌ ‘పాజిటివ్‌’)

హార్దిక్‌ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్‌, సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిక్ జులై 30న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హార్దిక్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. చిన్నారి చేతిని పట్టుకుని ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. కాగా,పాండ్యా, రాహుల్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ 2020కి సన్నద్దం అవుతున్నారు. పాండ్యా ముంబైకి, రాహుల్‌ పంజాబ్‌ తరుపున ఆడుతున్నారు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు రాహుల్‌ సారథ్యం వహిస్తున్నాడు. 

Let’s talk cricket 🙈

A post shared by Krunal Pandya (@krunalpandya_official) on

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు