పుష్కర కాలం తర్వాత కోహ్లి ఇలా.. 

19 Dec, 2020 12:22 IST|Sakshi

అడిలైడ్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంటేనే పరుగుల మెషీన్‌. పరుగుల వరద పారించడమే కాదు.. సెంచరీలను అవలీలగా చేయడంలో కూడా కోహ్లి దిట్టనే చెప్పాలి. ఇప్పటికే  అంతర్జాతీయ క్రికెట్‌లో 70 శతకాలు సాధించిన ఘనత కోహ్లిది. వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 శతకాలు కోహ్లి ఖాతాలో ఉన్నాయి.  ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తిరగరాశాడు కోహ్లి. కానీ ఈ ఏడాది కోహ్లికి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ ఏడాది కోహ్లి 9 వన్డేలు, మూడు టెస్టులు, 10 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. అయినప్పటికీ కోహ్లి ఒక్క సెంచరీని కూడా నమోదు చేయలేదు. (టీమిండియా.. 4,9,2,0,4,0,8, 4,0,1)

కాగా, కోహ్లి ఇలా సెంచరీ లేకుండా ఒక ఏడాదిని ముగించడం పుష్కర కాలం తర్వాత ఇదే తొలిసారి.   2008 నుంచి చూస్తే 2019 వరకూ కోహ్లి ప్రతీ ఏడాది కనీసం సెంచరీ చేస్తున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం కోహ్లి ఖాతాలో సెంచరీ చేరలేదు. 2020లో కోహ్లి అత్యధిక వ్యక్తిగత స్కోరు(అన్ని ఫార్మాట్లు పరంగా) 89. ఆస్ట్రేలియాతో అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కోహ్లి ఈ ఏడాది మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఈ టెస్టు తర్వాత కోహ్లి స్వదేశానికి పయనం కావడంతో  మళ్లీ ఏడాదే బరిలోకి దిగే అవకాశం మాత్రమే ఉంది. వచ్చే నెలలో కోహ్లి భార్య అనుష్క శర్మ బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉండటంతో అతను భారత్‌కు పయనం కానున్నాడు. (టీమిండియాకు ఏమైంది..? )

దాంతో కోహ్లి లేకుండానే  మిండియా మిగతా టెస్టులను ఆసీస్‌తో ఆడనుంది. మరొకవైపు ఈ ఏడాది కలిసి రాలేదనే చెప్పాలి. ఒక కెప్టెన్‌గా ఐదు వన్డేలను కోల్పోయిన అపప్రథను కోహ్లి  టగట్టుకున్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు మూడు వన్డేలను కోహ్లి నేతృత్వంలోని టీమిండియా కోల్పోగా, ఆస్ట్రేలియాపై వరుసగా రెండు వన్డేలను చేజార్చుకుంది. ఫలితంగా 21 ఏళ్ల తర్వాత వరుసగా ఐదు వన్డేలను చేజార్చుకున్న టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. 1981లో సునీల్ గావస్కర్‌ నేతృత్వంలోని టీమిండియా కూడా ఇలానే వరుసగా ఐదు వన్డేలను చేజార్చుకుంది.  ఆ తర్వాత కోహ్లినే ఇలా ఐదు వన్డేలను కోల్పోయిన టీమిండియా తొలి కెప్టెన్‌ కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు