Asia Cup 2022 - Ind Vs Pak: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!

5 Sep, 2022 12:28 IST|Sakshi

ఆసియాకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అద్భుతమైన అర్థసెంచరీ సాధించాడు. ఈ మెగా ఈవెంట్‌లో కోహ్లికి ఇది వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ కావడం గమాన్హం. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 60 పరుగులు సాధించాడు. కాగా ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించిన రన్‌మిషన్‌.. ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

టీ20ల్లో విరాట్‌ కోహ్లికి ఇది 32వ హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక ఫిప్టీ ప్లస్‌ స్కోర్‌లు సాధించిన ఆటగాడిగా విరాట్‌ రికార్డులెక్కాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరిట ఉండేది.

తాజా మ్యాచ్‌తో రోహిత్‌ను కింగ్‌ కోహ్లి అధిగమించాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో కోహ్లి(32) టాప్‌లో నిలవగా.. తర్వాతి స్థానాల్లో రోహిత్‌ శర్మ(31), బాబర్‌ ఆజాం (27), డేవిడ్‌ వార్నర్‌ (23), మార్టిన్‌ గప్తిల్‌ (22) ఉన్నారు.
చదవండి: Asia Cup 2022 - Ind Vs Pak: పంత్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్‌ శర్మ.. ఎందుకంటే..?

మరిన్ని వార్తలు