LeBron James: సంచలనం.. 40 ఏళ్ల రికార్డు కనుమరుగు

8 Feb, 2023 12:02 IST|Sakshi

నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌(NBA) స్టార్‌ ఆటగాడు లెబ్రాన్‌ జేమ్స్‌ చరిత్ర సృష్టించాడు. నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును ఈ ఏన్‌బీఏ ప్లేయర్‌ తాజాగా బద్దలుకొట్టాడు. లేకర్స్‌ తరపున ఆడుతున్న లెబ్రాన్‌ జేమ్స్‌ బుధవారం ఎన్‌బీఏ ఆల్ టైమ్ పాయింట్స్ స్కోరింగ్‌(38,387) అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కరీమ్‌ అబ్దుల్‌ జబ్బార్‌ పేరిట ఉంది.

ఒక్లహమా సిటీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో 36వ పాయింట్‌ వద్ద లెబ్రాన్‌ జేమ్స్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు. ప్రస్తుతం లెబ్రాన్‌ జేమ్స్‌ ఖాతాలో 38,388 పాయింట్లు ఉన్నాయి. లెబ్రాన్‌ ఈ రికార్డు అందుకున్న సమయంలో స్డేడియంలో దిగ్గజం కరీమ్‌ అబ్దుల్‌ జబ్బార్‌ ఉండడం విశేషం. వేలాది మంది ప్రేక్షకుల కరతాళద్వనుల మధ్య అబ్దుల్‌ జబ్బార్‌.. లెబ్రాన్‌ జేమ్స్‌ను అభినందించడం హైలైట్‌గా నిలిచింది.

ఇక ఆగస్టు 5, 1984లో అప్పటి ఎన్‌బీఏ స్టార్‌ కరీమ్‌ అబ్దుల్‌ జబ్బార్‌ 31,419 పాయింట్ల వద్ద​ విల్ట్‌ చాంబర్లెయిన్‌ను అధిగమించాడు. 1989లో కరీమ్‌ రిటైర్‌ అయినప్పటికి అతని రికార్డు మాత్రం చెక్కుచెదరలేదు. 2003-04 సీజన్ లో అరంగేట్రం చేసిన లెబ్రాన్ జేమ్స్.. తొలి సీజన్ మినహా తర్వాత ప్రతి సీజన్ లోనూ ఒక్కో మ్యాచ్ కు సగటున 25 పాయింట్లు స్కోరు చేయడం గమనార్హం.

లెబ్రాన్‌ జేమ్స్‌ సాధించిన రికార్డులు..
NBA ఛాంపియన్: 2012, 2013, 2016, 2020
NBA మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP): 2009, 2010, 2012, 2013
NBA ఫైనల్స్ MVP: 2012, 2013, 2016, 2020


NBA ఆల్ స్టార్: 19 సార్లు (2005-2023)
 NBA రూకీ ఆఫ్ ది ఇయర్: 2004
ఒలింపిక్ పతకాలు: మూడు (2008, 2012లో స్వర్ణం; 2004లో కాంస్యం)

చదవండి: ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో

Lebron James: ఎన్‌బీఏ స్టార్‌ క్రేజ్‌ మాములుగా లేదు; ఒక్క టికెట్‌ ధర 75 లక్షలు

మరిన్ని వార్తలు