అడిషనల్‌ ఎస్పీ మీరాబాయి

28 Jul, 2021 01:45 IST|Sakshi

రూ. కోటి నజరానాతోపాటు నియామక పత్రం అందజేసిన మణిపూర్‌ సీఎం

ఒలింపిక్‌ రజత పతక విజేతకు స్వరాష్ట్రంలో బ్రహ్మరథం

ఇంఫాల్‌: టోక్యో ఒలింపిక్స్‌లో తొలిరోజే భారత్‌కు పతక బోణీ అందించిన మహిళా వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానుకు స్వరాష్ట్రం మణిపూర్‌ బ్రహ్మరథం పట్టింది. 49 కేజీల కేటగిరీలో రజతం గెలి చిన ఆమె మంగళవారం సొంతూరుకు చేరుకుంది. ఇంఫాల్‌ విమానాశ్రయంలో సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ ఆమెకు ఘనస్వాగతం పలికారు. కేబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులు, క్రీడావర్గాలు మీరాకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఘన సత్కార వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే మణిపూర్‌ సీఎం బీరెన్‌ సింగ్‌ ఆమెకు కోటి రూపాయల చెక్‌ను, అడిషనల్‌ ఎస్పీ (స్పోర్ట్స్‌) నియామక పత్రాన్ని అందజేశారు. ఇదే వేడుకలో మీరా ఇద్దరు కోచ్‌లు అనిత, బ్రొజెన్‌లను కూడా ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె పదవీ బాధ్యతల కోసం నూతనంగా తీర్చిదిద్దిన అడిషనల్‌ ఎస్పీ చాంబర్‌ దాకా సీఎం, మంత్రివర్గ సహచరులు, రాష్ట్ర డీజీపీ ఎస్కార్టుగా వచ్చారు. 

ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు... 
కనీవినీ ఎరుగని స్వాగత సత్కారాలు తన మన స్సుకు హత్తుకోవడంతో మీరా కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. తన విజయానికి అద్భుతమైన స్వాగతానికి మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని వార్తలు