Mary Kom: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నుంచి వైదొలిగిన భారత దిగ్గజ బాక్సర్‌

10 Jun, 2022 21:50 IST|Sakshi

భారత మహిళా దిగ్గజ బాక్సర్‌.. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నుంచి వైదొలిగింది. గాయం కారణంగా కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపింది. విషయంలోకి వెళితే.. కామన్‌వెల్త్‌ గేమ్స్ ట్రయల్స్‌లో భాగంగా శుక్రవారం 48 కేజీల విభాగంలో నీతూతో తలపడింది. మ్యాచ్‌ ఆరంభంలోనే మేరీకోమ్‌ మోకాలికి గాయమైంది.మెడికల్‌ చికిత్స పొందిన తర్వాత బౌట్‌ను తిరిగి ప్రారంభించారు. అయితే నొప్పి ఉండడంతో మేరీకోమ్‌ చాలా ఇబ్బందిగా కనిపించింది.

ఇది గమనించిన రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ఆర్ఎస్‌సీఐ తీర్పు మేరకు నీతూను విజేతగా ప్రకటించారు. ఈ ఓటమితో బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్‌ను సైతం మేరీకోమ్ వదులుకోవాల్సి వచ్చింది. పలుమార్లు ఆసియా స్వర్ణ పతకాన్ని అందుకున్న మేరీకోమ్ చివరిసారిగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌ బరిలో నిలిచింది. అక్కడ ప్రీ క్వార్టర్స్ వరకు చేరుకున్నప్పటికీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆసియా క్రీడలతో పాటు కామన్‌వెల్త్ గేమ్స్‌పై ఆమె దృష్టి పెట్టారు. 

మరిన్ని వార్తలు