ఒలింపిక్స్‌ విజేతల సందడి: వందనా కటారియా భావోద్వేగం

11 Aug, 2021 14:31 IST|Sakshi

ఒలింపిక్స్‌ ఆటగాళ్లకు ఘన స్వాగతం

విజేతలకు పురస్కారాలు, సత్కారాలు

సాక్షి, న్యూఢిల్లీ:  టోక్యో ఒలింపిక్స్‌ లో అద్భుత ప్రదర్శన చూపించిన సొంతగడ్డపై అడుగిడిన క్రీడాకారులను ఘన స్వాగతం లభించింది.  నగదు పురస్కారాలు, సత్కారాలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి గౌరవించాయి. ముఖ్యంగా ఒడిశా ముఖ్యమంత్ర నవీన్ పట్నాయక్  రాష్ట్రానికి చెందిన పురుషులు, మహిళా హాకీ క్రీడాకారులను సన్మానించారు. బీరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్‌కు 2.5 కోట్ల నగదు పురస్కారాన్ని,  అలాగే దీప్ గ్రేస్ ఎక్కా నమితా టోపోలకు ఒక్కొక్కరికి రూ .50 లక్షల నగదు బహుమతిని అందజేశారు.

మరోవైపు టోక్యో 2020 లో పాల్గొన్న మహిళల హాకీ జట్టు సభ్యులు సలీమా టేట్, నిక్కీ ప్రధాన్ తమ సొంత రాష్ట్రానికి చేరుకున్న రాంచీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో అభిమానులు షేర్‌ చేస్తున్నారు. పంజాబ్‌కు చెందిన పురుషులు మహిళల హాకీ క్రీడాకారుల లుకూడాఅమృత్‌సర్ చేరుకున్నారు.  కామన్వెల్త్  ఆసియన్ గేమ్స్  వచ్చే నెల నుండి శిక్షణను ప్రారంభిస్తామని,  హాకీ జట్టు ఆటగాడు గుర్జంత్ సింగ్ వెల్లడించారు.

ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన తొలి ఇండియన్ ప్లేయర్‌కు  వందన కటారియాకు  డెహ్రాడూన్‌ విమానాశ్రయంలోనూ, గ్రామంలోనూ  వాయిద్యాలతో  గ్రామస్తులు గ్రాండ్‌ వెల్కం చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల తండ్రిని కోల్పోయిన వందనా భావోద్వేగానికి లోనయ్యారు. ఇంటికి చేరినపుడు తనను తాను ఎలా నిభాయించుకోవాలో అర్థంకాలేదని పేర్కొన్నారు. అటు ఒలింపిక్స్  వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న  మీరా బాయి చాను టెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను కలిసారు.

మరిన్ని వార్తలు