వేలంలో ఆ బూట్లకు రూ.4.6 కోట్లు

15 Aug, 2020 10:31 IST|Sakshi

న్యూయార్క్‌: బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌ వేసుకున్న బూట్లు వేలంలో రికార్డు ధర పలికాయి. 1985లో ఇటలీ వేదికగా జరిగిన ఒక ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో జోర్డాన్‌ వేసుకున్న ‘ఎయిర్‌ జోర్డాన్‌ వన్‌ హైస్‌ స్నీకర్స్‌’ షూస్‌కు 6 లక్షల 15 వేల అమెరికన్‌ డాలర్లు (సుమారు రూ. 4.60 కోట్లు) లభించాయి. దాంతో గత మేలో ఇవే రకానికి చెందిన జోర్డాన్‌ బూట్లకు పలికిన 5 లక్షల 60 వేల అమెరికన్‌ డాలర్లు (సుమారు రూ. 4.20 కోట్లు) ఆల్‌టై మ్‌ రికార్డును బద్దలు కొట్టినట్లు వేలం నిర్వహించిన క్రిస్టీ సంస్థ వెల్లడించింది.

అయితే ఎవరు కొనుగోలు చేశారనే విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించడానికి ఇష్టపడలేదు. నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ సంఘం (ఎన్‌బీఏ) టోర్నీలో మకుటం లేని మహారాజుగా నిలిచిన మైకేల్‌ జోర్డాన్‌... తనకే సాధ్యమైన ప్రత్యేక ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. చికాగో బుల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన జోర్డాన్‌... తన జట్టు జెర్సీ కలర్‌ అయిన నలుపు, ఎరుపు రంగులతో కూడిన బూట్లను వాడేవాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు