సూపర్‌ బేబి.. డ్యాన్స్‌తో దుమ్మురేపావు; వీడియో వైరల్‌

4 Jul, 2021 14:56 IST|Sakshi

లండన్‌: టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీ గారాలపట్టి ఐరా డ్యాన్స్‌తో దుమ్మురేపింది. ఈ సందర్భంగా తన కూతురు డ్యాన్స్‌ను చూసి మురిసిపోయిన షమీ '' సూపర్‌ బేబీ '' అంటూ కామెంట్‌ చేశాడు. షమీ తన భార్య హసీన్‌ జహాన్‌తో ఉన్న వైవాహిక గొడవల నేపథ్యంలో తన కూతురు ఐరాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీలుచిక్కినప్పుడల్లా తన కూతురుతో ఆనందంగా గడుపుతున్నాడు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో బిజీగా ఉన్న షమీ తన కూతురును చాలా మిస్‌ అవుతున్నట్లు ఇటీవలే తెలిపాడు.

ఈ సందర్భంగానే ఐరా డ్యాన్స్‌ను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ఇక కివీస్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే షమీ బౌలర్‌గా మాత్రం సక్సెస్‌ అయ్యాడు. మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో షమీ నాలుగు వికెట్లు తీశాడు. కాగా మ్యాచ్‌ సందర్భంగా మైదానంలోనే టవల్‌ చుట్టుకొని అభిమానులను అలరించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. 

A post shared by Mohammad Shami , محمد الشامي (@mdshami.11)

మరిన్ని వార్తలు