సానియా- షోయబ్‌ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్‌

15 Dec, 2022 09:24 IST|Sakshi

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన భర్త షోయబ్‌ మాలిక్‌తో విభేదాల కారణంగా విడాకులకు సిద్ధమయ్యారనే వార్తలు కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వారు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్‌ నెలకొంది. షోయబ్‌ మాలిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ బయో చూసి ఆయన ఇచ్చిన కొత్త ట్విస్ట్‌కు అంతా ఆశ్చర్యపోతున్నారు. తన ఇన్‌స్టా బయోలో తాను సూపర్‌వుమన్‌ సానియా మిర్జాకు భర్తను అంటూ రాసుకొచ్చారు షోయబ్‌. ‘అథ్లెట్‌, సూపర్‌వుమన్‌ సానియామిర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రి’ అని పేర్కొన్నారు. 

విడాకుల విషయంపై ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో..కొద్ది రోజుల క్రితం పుకార్ల నుంచి తనను, మీర్జాను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి చేశారు షోయబ్‌ మాలిక్‌. ‘ఇది మా వ్యక్తిగతం. ఈ ప్రశ్నకు నేను, నా భార్య సమాధానం ఇవ్వటం లేదు. మమ్మల్ని వదిలేయండి.’ అని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. టెన్నిస్‌ స్టార్‌ మీర్జా సోలోగా ఫోటోషూట్స్‌ చేస్తుండటం రూమర్లకు మరింత బలం చేకూర్చుతున్నట్లవుతోంది. ఇది ఇలా ఉండగా.. ఖతర్‌ వేదికగా మంగళవారం జరిగిన అర్జెంటీనా, క్రొయేషియా మ్యాచ్‌ మైదానంలో తన సోదరితో పాటు సానియా తళుక్కుమనటం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్‌.. ముక్కలైన హృదయం అంటూ..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు