లంక లెజండరీ ఓపెనర్‌ దిల్షాన్‌.. డీకే మాదిరే! ఉపుల్‌ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! బ్రెట్‌ లీ సైతం..

24 Jun, 2023 09:00 IST|Sakshi

రెండు మనుసుల కలయికతో.. ఇద్దరు మనుషులు పరస్పర నమ్మకంతో దాంపత్య జీవితంలో ముందుకు సాగితేనే ఆ బంధం నాలుగుకాలాల పాటు వర్ధిల్లుతుంది. భాగస్వాములలో ఏ ఒక్కరు పెళ్లినాటి ప్రమాణాలు తప్పినా ఆ బంధం విచ్ఛిన్నమవుతుంది. ముఖ్యంగా ‘మూడో వ్యక్తి’ని తమ జీవితంలోకి ఆహ్వానించి ప్రాణంగా ప్రేమించిన పార్ట్‌నర్‌ను మోసం చేస్తే అంతకంటే ద్రోహం మరొకటి ఉండదు.

టీమిండియా క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌తో పాటు శ్రీలంక మాజీ బ్యాటర్‌ తిలకరత్నె దిల్షాన్‌, ఆస్ట్రేలియా బౌలింగ్‌ దిగ్గజం బ్రెట్‌ లీ తమ వైవాహిక జీవితంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా డీకే, దిల్షాన్‌ తమ భార్యలు.. తమతో బంధంలో కొనసాగుతూనే.. తమ స్నేహితులతోనే అనుబంధం పెనవేసుకోవడం భరించలేకపోయారు. వారితో బంధానికి వీడ్కోలు పలికి కొత్త జీవితం మొదలుపెట్టి ప్రస్తుతం వైవాహిక బంధంలో సంతోషంగా గడుపుతున్నారు. వారి జీవితాల్లో ఏం జరిగిందంటే..

స్నేహం ముసుగులో వెన్నుపోటు
చిన్ననాటి స్నేహితురాలైన నికిత వంజారాను ప్రేమించి పెళ్లాడాడు దినేశ్‌ కార్తిక్‌. డీకే సహచర క్రికెటర్‌, ఫ్రెండ్‌ అయిన మురళీ విజయ్‌తో బంధం కొనసాగించింది. వారిద్దరి రహస్య రిలేషన్‌షిప్‌ తెలుసుకున్న దినేశ్‌ గుండె ముక్కలైంది.

దీంతో 2012లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఈ క్రమంలో నికిత ఎంచక్కా మురళీ విజయ్‌ను పెళ్లి చేసుకుని సెటిల్‌ అయింది. మరోవైపు.. స్వ్యాష్‌ ప్లేయర్‌ దీపికా పళ్లికల్‌ రూపంలో రెండోసారి ప్రేమను పొందిన డీకే ఆమెను వివాహమాడాడు. ఈ జంటకు ప్రస్తుతం కవలలు(ఇద్దరు కుమారులు) సంతానం.

దిల్షాన్‌ది ఇంచుమించు ఇదే పరిస్థితి
లంక లెజండరీ ఓపెనర్‌ తిలకరత్నె దిల్షాన్‌ నిలంక వితంగే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె దిల్షాన్‌ ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌ ఉపుల్‌ తరంగతో అనుబంధం పెంచుకుందట. ఈ క్రమంలో దిల్షాన్‌తో విడాకులు తీసుకున్న నిలంక.. ఆ తర్వాత ఉపుల్‌ను పెళ్లాడింది. నిజానికి నిలంక, ఉపుల్‌ మధ్య అతి చనువే దిల్షాన్‌తో ఆమె విడిపోవడానికి కారణమని గతంలో వార్తలు వచ్చాయి.


భార్య మంజులతో దిల్షాన్‌

ఇక నిలంక- దిల్షాన్‌లకు ఒక కుమారుడు సంతానం కాగా.. భరణం, కుమారుడి సంరక్షణ కోసం నిలంక.. దిల్షాన్‌ను కోర్టుకు లాగింది. ఈ క్రమంలో ఆమెకు అనుకూలంగా తీర్పురాగా అతడు కొడుకుకు దూరమయ్యాడు. ఆ తర్వాత నటి మంజుల థిలినిని పెళ్లాడిన దిల్షాన్‌కు మరో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు జన్మించారు.

బ్రెట్‌ లీ మాజీ భార్య సైతం
ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ బ్రెట్‌ లీ కూడా భార్యా బాధితుడే అంటారు. ఆటతో బిజీగా ఉండే లీతో తన జీవితం సంతోషంగా లేదని భావించిన అతడి భార్య.. రగ్బీ ప్లేయర్‌ను పెళ్లాడినట్లు సిడ్నీ హెరాల్డ్‌ గతంలో వెల్లడించింది.

చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్‌ విజేత, 2 సార్లు ఐపీఎల్‌ ‘విన్నర్‌’.. ఇప్పుడు పోలీస్‌
ఆడపడుచు అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్‌ తెలుసా? వందల కోట్లు!

మరిన్ని వార్తలు