భారత్‌ నుంచి హర్మన్‌ప్రీత్‌ మాత్రమే... 

4 Sep, 2023 01:04 IST|Sakshi

ఆ్రస్టేలియాలో జరిగే మహిళల బిగ్‌బాష్‌ లీగ్  టి20 టోర్నీకి సంబంధించి ఆదివారం విదేశీ క్రికెటర్ల డ్రాఫ్ట్‌ కార్యక్రమం జరిగింది. ఇందులో మొత్తం 116 మంది విదేశీ క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా... ఎనిమిది ఫ్రాంచైజీలు 17 మందిని ఎంపిక చేసుకున్నాయి.

భారత్‌ నుంచి 18 మంది క్రికెటర్లు తుది జాబితాలో ఉండగా... కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు మాత్రమే అవకాశం దక్కింది. మెల్‌బోర్న్‌ రెనెగెడ్స్‌ జట్టు హర్మన్‌ప్రీత్‌ను ఎంపిక చేసుకుంది. 2021–2022 సీజన్‌లో హర్మన్‌ప్రీత్‌ మెల్‌బోర్న్‌ తరఫున ఆడి 406 పరుగులు చేయడంతోపాటు 15 వికెట్లు కూడా తీసింది.   

 
 

మరిన్ని వార్తలు