ఓటమి అంచుల్లో నుంచి నెగ్గిన నాదల్‌

14 May, 2021 04:46 IST|Sakshi

రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో తొమ్మిదిసార్లు చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) అతికష్టమ్మీద క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. డెనిస్‌ షపవలోవ్‌ (కెనడా)తో 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో రెండో సీడ్‌ నాదల్‌ 3–6, 6–4, 7–6 (7/3)తో గెలుపొంది ఊపిరి పీల్చుకున్నాడు. రెండో సెట్‌లో 0–3తో... మూడో సెట్‌లో 1–3తో వెనుకబడిన నాదల్‌ చివరకు 5–6 స్కోరు వద్ద తన సర్వీస్‌లో ఏకంగా రెండు మ్యాచ్‌ పాయింట్లను కూడా కాపాడుకొని గట్టెక్కాడు.  

మరిన్ని వార్తలు