Harbhajan Singh Rajinikanth Tatoo: ఛాతిపై టాటూతో తలైవాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీమిండియా క్రికెటర్‌

12 Dec, 2021 16:13 IST|Sakshi

Rajinikanth Birthday: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 71వ జన్మదినం(డిసెంబర్ 12) సందర్భంగా టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ వినూత్న శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. తలైవా టాటూను తన ఛాతీ వేసుకుని ప్రత్యేకంగా బర్త్‌ డే విషెస్‌ చెప్పాడు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘నా ఛాతీపై సూపర్ స్టార్‌ను కలిగి ఉన్నాను. మీరు 80వ దశకంలో బిల్లాగా.. 90లలో బాషాగా.. ఇటీవలి కాలంలో అన్నాత్తే (పెద్దన్న)గా అలరించారు.. సూపర్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అంటూ తమిళ్‌లో రాసుకొచ్చాడు. 

A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3)


భజ్జీ తమిళ్‌లో ట్వీట్‌ చేయడంతో ఆ భాషాభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు మురిసిముక్కలైపోతున్నారు. భజ్జీ షేర్‌ చేసిన ఫోటోను లైకులు, షేర్లతో మోతెక్కిస్తున్నారు. కాగా, హర్భజన్‌ ఐపీఎల్‌లో కొన్ని సీజన్ల పాటు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతనిధ్యం వహించిన సంగతి తెలిసిందే. 
చదవండి: యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌!

>
మరిన్ని వార్తలు