#RavindraJadeja: అరుదైన ఘనత.. టీమిండియా తరపున లీడింగ్‌ వికెట్‌టేకర్‌గా

10 Jun, 2023 18:04 IST|Sakshi

ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. మొదట బ్యాటింగ్‌లో 48 పరుగులు చేసిన జడేజా.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌.. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో జడేజా టెస్టుల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జడేజా రికార్డులకెక్కాడు. 

గ్రీన్‌ను ఔట్‌ చేయడం ద్వారా జడేజా 268వ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బిషన్‌ సింగ్‌ బేడీ(266 వికెట్లు)ని క్రాస్‌ చేసి ఓవరాల్‌ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో రంగనా హెరాత్‌(433 వికెట్లు), డేనియల్‌ వెటోరి(362 వికెట్లు), డ్రీక్‌ అండర్‌వుడ్‌(298 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక టీమిండియా తరపున లెఫ్టార్మ్‌ స్పిన్నర్లలో జడేజా(268 వికెట్లు), బిషన్‌ సింగ్‌ బేడీ(266 వికెట్లు) వినూ మన్కడ్‌(161 వికెట్లు), రవిశాస్త్రి(151 వికెట్లు), దిలిప్‌ దోషి(114 వికెట్లు), ప్రగ్యాన్‌ ఓజా(113 వికెట్లు) వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. 

ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్ల జాబితాలో జడేజా ఏడో స్థానానికి చేరుకున్నాడు. జడేజా ప్రస్తుతం 65 టెస్టుల్లో 268 వికెట్లతో కొనసాగుతున్నాడు. జడ్డూ కంటే ముందు అనిల్‌ కుంబ్లే(619 వికెట్లతో) అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్‌(474 వికెట్లు), కపిల్‌ దేవ్‌(434 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. హర్బజన్‌(417 వికెట్లు), ఇషాంత్‌ శర్మ, జహీర్‌ ఖాన్‌లు 311 వికెట్లతో  నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు.

చదవండి: WTC Final: టీమిండియా గెలుస్తుందా లేక చేతులెత్తేస్తుందా..?

అడ్డుకునేలోపే అదిరిపోయే ట్విస్ట్‌.. జడ్డూ దెబ్బకు మైండ్‌బ్లాక్‌

మరిన్ని వార్తలు