IPL 2022 Auction: ఆర్‌సీబీ రిటైన్‌ లిస్ట్‌.. కోహ్లి, మ్యాక్స్‌వెల్‌ 

25 Nov, 2021 21:16 IST|Sakshi

Virat Kohli, Glenn Maxwell Likely To Retain By RCB Ahead IPL 2022 Auction.. ఐపీఎల్‌ 2022 సీజన్‌ మెగా వేలానికి ముందు ప్రస్తుతం ఆయా జట్లలో రిటైన్‌ల పర్వం కొనసాగుతుంది. వచ్చే సీజ‌న్ కోసం జ‌ర‌గ‌నున్న ఆట‌గాళ్ల వేలానికి ముందు ఆయా జ‌ట్లు త‌మ జాబితాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది.న‌వంబ‌ర్ 30వ తేదీలోగా 8 ఫ్రాంచైజీలు ఏయే ఆట‌గాళ్లను నిలుపుకోవాల‌నుకుంటున్నాయనే వివ‌రాల‌ను వెల్లడించాలి. ఇప్పటికే ప్రధానంగా ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే లాంటి జట్లు ఏ ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంటున్నామనే దానిపై సమాచారం ఇచ్చింది.

చదవండి: IPl 2022 Auction: శిఖర్ ధావన్‌కు బిగ్‌ షాక్‌.. ఇక ఆ జట్టులో నో ఛాన్స్‌!

తాజాగా ఆర్‌సీబీ కూడా రిటైన్‌ ఆటగాళ్ల లిస్టును విడుదల చేసింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లితో పాటు ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌లు ఆర్‌సీబీలోనే ఉండనున్నారు.  గ‌రిష్టంగా న‌లుగురు ఆట‌గాళ్లను రిటేన్ చేసుకోవ‌డానికి ప్రతీ జ‌ట్టుకు అవ‌కాశం ఉంటుంది. త‌మ వ‌ద్దే నిలుపుకున్న వారిలో ఇద్దరు విదేశీ ఆట‌గాళ్లు కూడా ఉండ‌వ‌చ్చు. రిటెన్షన్‌ విధానం ముగిసిన త‌ర్వాత‌.. ఆట‌గాళ్ల వేలానికి ముందు.. కొత్త జ‌ట్లు ల‌క్నో, అహ్మదాబాద్‌లు.. ముగ్గురేసి ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. ఇందులో ఇద్దరు స్వదేశీ ప్లేయర్లు.. ఒక విదేశీ ప్లేయ‌ర్ ఉంటారు.

చదవండి: IPL 2022 Auction- KL Rahul: లక్నో జట్టు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌..! 

మరిన్ని వార్తలు