బంతి దొరకడమే ఆలస్యం.. సూపర్‌ స్టంపింగ్‌

16 Feb, 2021 10:14 IST|Sakshi

చెన్నై: టీమిండియా వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ సూపర్‌ స్టంపింగ్‌తో అదరగొట్టాడు. నాలుగోరోజు ఆట ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే పంత్‌ మెరుపువేగంతో లారెన్స్‌ను అవుట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 25వ ఓవర్‌ మొదటి బంతిని షాట్‌ ఆడేందుకు లారెన్స్‌ క్రీజు దాటి ముందుకు వచ్చాడు. అయితే బంతి లారెన్స్‌ను దాటి కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది. అప్పటికే లారెన్స్‌ క్రీజుకు చాలా దూరంలో ఉండడంతో మెరుపు వేగంతో డైవ్‌ చేసిన పంత్‌ బెయిల్స్‌ను ఎగురగొట్టాడు.

లారెన్స్‌ కనీసం బ్యాట్‌ను పెట్టే అవకాశం కూడా ఇవ్వలేదు... అంతేగాక పంత్‌ స్టంపింగ్‌తో అంపైర్‌ నిర్ణయం కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా రాలేదు. మొత్తానికి టీమిండియా నాలుగోరోజు ఆట ప్రారంభంలోనే వికెట్‌తో భోణీ కొట్టింది. 482 పరుగులు భారీ లక్ష్య చేదనలో ఇంగ్లండ్‌ ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోగా.. టీమిండియా విజయానికి మాత్రం 6 వికెట్లు అవసరం ఉన్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 4 వికెట్లకు 78 పరుగులు చేసింది. రూట్‌ 15, స్టోక్స్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: పాపం పుజారా.. ఎంత పని జరిగిపోయింది

>
మరిన్ని వార్తలు