'రోహిత్‌ను ఆపడం చాలా కష్టం.. చాలా విషయాలు నేర్చుకుంటున్నా'

1 Oct, 2023 09:11 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్ల వామాప్‌ మ్యాచ్‌ల్లో బీజీబీజీగా ఉన్నాయి. ఇక ఈ మెగా టోర్నీలో భారత తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ స్కిల్స్‌ను తనను ఎంతగానే ఆకట్టుకున్నాయని లబుషేన్‌ అన్నాడు.

"రోహిత్‌ శర్మ ఎటువంటి రిస్క్‌ తీసుకోకుండా అద్భుతమైన షాట్లు ఆడుతాడు. అతడు బ్యాటింగ్‌ చేసేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటాడు. ఒక్కసారి అతడు తన రిథమ్‌ను పొందితే ఆపడం చాలా కష్టం. మేము పెవిలియన్‌కు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు రోహిత్‌తో.. మీరు ఎలా ఆడుతున్నారో అలా ఆడటానికి ప్రయత్నిస్తాననని చెప్పాను.

నేను మీ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాని చెప్పాను. ఇక్కడి పరిస్ధితులు మాకు కొత్త. కానీ మీకు ఇక్కడ ఆడిన అనుభవం చాలా ఉంది. కాబట్టి ప్రత్యర్ధిలుగా ఉండి చాలా విషయాలు నేర్చుకుంటున్నామని రోహిత్‌ చెప్పా" అని ఫాక్స్‌ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లబుషేన్‌ పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: 'అశ్విన్‌ ఎంపికలో ఆశ్చర్యమేమీలేదు.. చెన్నైలో చుక్కలు చూపిస్తాడు'

మరిన్ని వార్తలు