పండుగ నాడు ఫొటోల కోసం సానియా మీర్జా తంటాలు

14 May, 2021 12:24 IST|Sakshi

భారత టెన్నీస్‌ స్టార్‌ సానియా మీర్జా తన భర్త షోయబ్‌ మాలిక్‌తో కలిసి రంజాన్‌ పర్వదిన వేడుక చేసుకుంది. ఈ సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంది. ‘ఫొటోలు దిగేప్పుడు ఎన్ని కష్టాలో’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ ఐదు ఫొటోలు పంచుకుంది. ఆ ఫొటోలను చూస్తే మొదటి ఫొటో బాగానే రాగా.. మిగతా నాలుగు ఫొటోలు బ్లర్‌ కావడం.. షేక్‌ అవడం వంటివి జరిగాయి. దీంతో ఆ ఫొటోలు సక్రమంగా రాలేదు.

ఇదే విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా చెప్పింది. అనంతరం తన కుమారుడు ఇజాన్‌ మీర్జా మాలిక్‌తో కలిసి సముద్రపు ఒడ్డున సరదాగా నడయాడుతున్న ఫొటోలను కూడా సానియా మీర్జా పంచుకుంది. దీంతో పాటు ట్విటర్‌లో కూడా రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత తక్కువ మంది ప్రార్థనల్లో పాల్గొనండి. ఈ భారం నుంచి అల్లా ఈ భూమిని రక్షిస్తాడు’ అని కరోనా మహమ్మారి విషయమై పేర్కొంది. ప్రస్తుతం టోక్యో ఒలంపిక్స్‌ కోసం సానియా మీర్జా సిద్ధమవుతోంది. నాలుగేళ్ల తర్వాత ఒలంపిక్స్‌లో పాల్గొననున్నది. 

చదవండి: టోక్యో ఒలింపిక్ప్‌కు సానియా మీర్జా అర్హత
 

A post shared by Sania Mirza (@mirzasaniar)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు