సత్తా చాటుతున్న భారత షూటర్లు.. మరో సిల్వర్‌ మెడల్‌

30 Sep, 2023 09:59 IST|Sakshi

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. శనివారం జరిగిన  10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత షుటర్లు సిల్వర్‌ మెడల్‌ గెలుచుకున్నారు. సరబ్జోత్ సింగ్ ,దివ్యతో కూడిన భారత ద్వయం  రెండో స్ధానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ ఈవెంట్‌లో భారత్‌ 14 పాయింట్లు సాధించి రెండో స్ధానంతో సరిపెట్టుకుంది. 16 పాయిట్లతో అగ్రస్ధానంలో నిలిచిన బోవెన్ జాంగ్ రాంక్సిన్ జియాంగ్‌లతో కూడిన చైనా జోడీ గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఏషియన్‌ గేమ్స్‌లో షూటింగ్‌లో భారత్ మొత్తంగా 19 పతకాలు గెలుచుకుంది. అందులో 6 గోల్డ్‌, 8 సిల్వర్‌, 5 కాంస్య పతకాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు