IPL 2021 2nd Phase: షకీబ్‌ ఆల్‌టైమ్‌ ఎలెవెన్‌ జాబితా.. షాక్‌లో డివిలియర్స్‌, గేల్‌

14 Sep, 2021 20:25 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ సెకండ్‌ ఫేజ్‌ ప్రారంభానికి వారం మాత్రమే గడువు ఉండడంతో ఫ్యాన్స్‌ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ తన ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ ఎలెవెన్‌ జాబితాను ప్రకటించాడు. మొత్తం 11 మందితో కూడిన జాబితాలో విండీస్‌ హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యపరిచింది. షకీబ్‌ ప్రకటించిన టీమ్‌కు ఎంఎస్‌ ధోనిని(సీఎస్‌కే) కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశాడు.

చదవండి: 'నీకు హిందీ వచ్చా' అంటూ ప్రశ్న.. డేవిడ్‌ మిల్లర్‌ కౌంటర్‌

ఇక రోహిత్‌ శర్మ( ముంబై ఇండియన్స్‌), డేవిడ్‌ వార్నర్‌(ఎస్‌ఆర్‌హెచ్‌)లను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. వన్‌డౌన్‌లో విరాట్‌ కోహ్లి(ఆర్‌సీబీ),  మిడిలార్డర్‌లో  ధోనితో పాటు కేఎల్‌ రాహుల్‌( కింగ్స్‌ పంజాబ్‌)ను ఎంచుకున్నాడు.  ఇక ఆల్‌రౌండర్లుగా బెన్‌ స్టోక్స్‌(రాజస్తాన్‌ రాయల్స్‌), రవీంద్ర జడేజా( సీఎస్‌కే)లను ఎంపిక చేశాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్ లేకుండానే మలింగ, బుమ్రా, భువనేశ్వర్‌లను ఫాస్ట్‌ బౌలర్లుగా ఎంపిక చేసుకున్నాడు. కాగా షకీబ్‌ ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే.

ఇక షకీబ్‌ ప్రకటించిన జాబితాలో ఆటగాళ్లు వ్యక్తిగతంగా ఒక్కో మైలురాయిని అందుకోవడం విశేషం. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్‌ నిలిస్తే.. విదేశీ ఆటగాళ్ల జాబితాలో సక్సెస్‌ రేట్‌ ఎక్కువగా ఉన్నది వార్నర్‌కే. ఇక కోహ్లి ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగులు(6వేల పరుగులు) చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఇక కెప్టెన్‌గా ఎంపికయిన ధోని ఐపీఎల్‌లోనే సీఎస్‌కే మూడు సార్లు ట్రోఫీ అందించిన ఆటగాడిగా నిలిచాడు. 

షకీబ్‌ ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ ఎలెవెన్‌ జాబితా:
ఎంఎస్‌ ధోనిని(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌)రోహిత్‌ శర్మ,  డేవిడ్‌ వార్నర్‌, విరాట్‌ కోహ్లి(ఆర్‌సీబీ), కేఎల్‌ రాహుల్‌, బెన్‌ స్టోక్స్‌, రవీంద్ర జడేజా, లసిత్‌ మలింగ, జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌

చదవండి: Gambhir: మనం ఇంకా రాహుల్ అసలైన బ్యాటింగ్ చూడలేదు..

మరిన్ని వార్తలు