పంత్‌పై సౌతాఫ్రికా స్పిన్నర్‌ ప్రశంసల వర్షం

22 Jan, 2022 16:25 IST|Sakshi

Tabraiz Shamsi Praise Rishabh Pant Batting.. టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌పై సౌతాఫ్రికా స్పిన్నర్‌ తబ్రెయిజ్‌ షంసీ ప్రశంసల వర్షం కురిపించాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో పంత్‌ బ్యాటింగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. 71 బంతుల్లో 85 పరుగులు చేసిన పంత్‌ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉన్నాయి. పంత్‌ బ్యాటింగ్‌లో ఎక్కడా నిర్లక్ష్యం కనిపించలేదు. ఆడినంతసేపు దూకుడు కనబరిచిన పంత్‌.. సౌతాఫ్రికా బౌలర్లకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా పరుగులు రాబట్టాడు. ఇదే అంశం సౌతాఫ్రికా బౌలర్‌ షంసీని బాగా ఆకట్టుకుంది. అందుకే పంత్‌ తన బౌలింగ్‌లో ఔటై వెళ్లిపోతున్నప్పుడు.. షంసీ తన చేతులతో వెనుక నుంచి పంత్‌ భుజాన్ని తడుతూ.. బాగా ఆడావన్నట్లుగా సిగ్నల్‌ ఇచ్చాడు. తాజాగా షంసీ ఆ ఫోటోను షేర్‌ చేస్తూ.. ;''బాగా కష్టపడ్డాడు.. బాగా ఆడాడు.. ఒక్కసారి గీత దాటలేదు.. '' అంటూ తనదైన శైలిలో క్యాప్షన్‌ జత చేశాడు.  

చదవండి: Rishabh Pant: 'సఫారీ గడ్డపై ధోనికి సాధ్యం కాలేదు.. పంత్‌ సాధించాడు'

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (71 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్‌ (79 బంతుల్లో 55; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా 48.1 ఓవర్లలో 3 వికెట్లకు 288 పరుగులు చేసి గెలిచింది. జేన్‌మన్‌ మలాన్‌ (108 బంతుల్లో 91; 8 ఫోర్లు, 1 సిక్స్‌), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డి కాక్‌ (66 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 132 పరుగులు జోడించారు. చివరి మ్యాచ్‌ ఆదివారం కేప్‌టౌన్‌లో జరుగుతుంది.

చదవండి: Virat Kohli: డ్రెస్సింగ్‌రూమ్‌లో కోహ్లి చిందులు.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు