ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చందర్‌పాల్, ఎడ్వర్డ్స్, ఖాదిర్‌

11 Nov, 2022 08:39 IST|Sakshi

సిడ్నీ: వెస్టిండీస్‌ దిగ్గజం చందర్‌పాల్, ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ చార్లట్‌ ఎడ్వర్డ్స్, పాకిస్తాన్‌ దివంగత స్పిన్‌ లెజెండ్‌ అబ్దుల్‌ ఖాదిర్‌లను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విశిష్ట క్రికెటర్ల జాబితాలో చేర్చారు. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్‌ సందర్భంగా ముగ్గురు క్రికెటర్లకు ఐసీసీ పురస్కారాలు అందజేశారు. 21 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో  చందర్‌ పాల్‌ అన్ని ఫార్మాట్లలో కలిపి 20,988 పరుగులు చేశాడు.

ఇందులో 41 సెంచరీలు, 125 అర్ధసెంచరీలున్నాయి. ఇంగ్లండ్‌ గ్రేటెస్ట్‌ క్రికెటర్లలో ఎడ్వర్డ్స్‌కు ప్రత్యేక స్థానముంది. ఆమె సారథ్యంలోనే ఇంగ్లండ్‌ వన్డే, టి20 ఫార్మాట్లలో ప్రపంచకప్‌లు సాధించింది.  పాక్‌ దిగ్గజ లెగ్‌ స్పిన్నర్‌ ఖాదిర్‌ 63 వయస్సులో (2019) కన్నుమూశారు. టెస్టు క్రికెటర్లలో అలనాటి గ్రేటెస్ట్‌ స్పిన్నర్‌గా వెలుగొందారు. 67 మ్యాచుల్లోనే 236 వికెట్లు తీసిన ఘనత ఆయనది. 1987లో ఇంగ్లండ్‌పై 56 పరుగులిచ్చి 9 వికెట్లు తీశాడు. ఖాదిర్‌ తరఫున అతని కుమారుడు ఉస్మాన్‌ పురస్కారాన్ని అందుకున్నారు.
చదవండి: Team India: ఐపీఎల్‌ బ్యాన్‌ చేస్తేనే దారిలోకి వస్తారా!

మరిన్ని వార్తలు