వీడలేని ప్రేమ బంధం.. ప్రాణాలను బలితీసుకుంది

11 Nov, 2022 08:44 IST|Sakshi

రాయచూరు రూరల్‌: తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్నాటకలోని మస్కి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై సింధనూరు డీఎస్పీ వెంకటప్ప నాయక్‌ కథనం మేరకు.. మస్కి తాలూకా కురేకల్లూరుకు చెందిన మేఘన(18), బాగల్‌కోట జిల్లా హునగుంద తాలూకా ఇలకల్‌ నివాసి ముత్తన్న నాయక్‌(18) ఆరు నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. 

వీరి కులాలు వేరు కావడంతో వివాహానికి ఇరుకుటుంబాలవారూ నిరాకరించారు. దీంతో ఆ జంట తీవ్ర మనో వేదనకు గురైంది. ఈక్రమంలో మేఘన బుధవారం రాత్రి మస్కిలోని బావిలో దూకగా, ముత్తన్న నాయక్‌ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మస్కి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.     

మరిన్ని వార్తలు