అదరగొట్టిన లిండే.. ఓటమి పాలైన పా​కిస్తాన్‌

13 Apr, 2021 08:07 IST|Sakshi

రెండో టి20లో పాక్‌పై దక్షిణాఫ్రికా గెలుపు  

జొహెన్నెస్‌బర్గ్‌: జార్జి లిండే ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (3/23; 10 బంతుల్లో 20 నాటౌట్‌; 2 సిక్స్‌లు) కనబర్చడంతో... పాకిస్తాన్‌తో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 140 పరుగులు చేసింది. బాబర్‌ ఆజమ్‌ (50; 5 ఫోర్లు), హఫీజ్‌ (32; 6 ఫోర్లు) రాణించారు. లిండేకు తోడు విలియమ్స్‌ కూడా 3 వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి గెలిచింది. మార్క్‌రమ్‌ (54; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)... క్లాసెన్‌ (36; 4 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఆల్‌రౌండ్‌ షోతో అదరొట్టిన జార్జి లిండే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును అందుకున్నాడు. కాగా 3 వన్డేల సిరీస్‌ను పాక్‌ 2-1తో కైవసం చేసుకోగా, నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి.

చదవవండి: ఐపీఎల్‌ కాసుల వర్షం కురిపిస్తుంది.. కాబట్టి: పాక్‌ మాజీ పేసర్‌ 
ఐపీఎల్‌ కోసం మరీ ఇలా చేస్తారా; నువ్వైతే ఆడొచ్చు కానీ?!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు