కోహ్లికి కితాబిచ్చిన సునీల్‌ గావస్కర్‌

23 Aug, 2020 11:39 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ చరిత్రలో విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని ప్రస్తుత జట్టు అత్యుత్తమైందని దిగ్గజ మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లో అయినా రాణించి విజయాలు అందించే బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు జట్టులో ఉన్నారని తెలిపారు. జట్టుకు అవసరమైన సమష్టి బలం సరిపడా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో బ్యాట్స్‌మెన్‌ రాణించడంపైనే టీమ్‌ సక్సెస్‌ ఆధారపడి ఉండేదని, ఇప్పుడు పరిస్థితులు మారాయని శనివారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ టీమిండియా పేస్‌ దళానికి బలం అని చెప్పారు.
(చదవండి: అభిమానుల మనసు గెలుచుకున్న ధోని)

ప్రతిభావంతమైన సీమర్లు భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌తోపాటు అనుభవజ్ఞుడైన ఇశాంత్‌ శర్మ జట్టులో ఉన్నాడని తెలిపారు. ఇక టీమిండియా అత్యుత్తమ సారథుల్లో కోహ్లీ ఒకరని గావస్కర్‌ కితాబిచ్చారు. అతని సారథ్యంలోనే భారత జట్టు టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించిందని గుర్తు చేశారు. టీమిండియాను టెస్టుల్లో మొదటి స్థానంలో నిలిపిన ఘనత కెప్టెన్‌ కోహ్లీదేనని అన్నారు. అతని సారథ్యంలోనే ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్‌ నెగ్గిందని తెలిపారు. కాగా, మహేంద్ర సింగ్‌ ధోని నుంచి కోహ్లీ 2014లో టెస్టు జట్టు పగ్గాలు అందుకున్నాడు. 2017లో పరిమిత ఓవర్ల ఆటలోనూ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. 
(చదవండి: మీరు నా హార్ట్‌ పిజ్జాను దొంగిలించారు: చహల్‌)

మరిన్ని వార్తలు