హెలికాప్టర్‌ షాట్‌ ఇరగదీశాడుగా..!

24 Jul, 2020 18:11 IST|Sakshi

అఫ్గనిస్తాన్‌ ఆల్ రౌండ‌ర్ ర‌షీద్ ఖాన్ గురించి క్రికెట్ అభిమానుల‌కు పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న బౌలింగ్‌తో ఎంత‌టి బ్యాట్స్‌మన్‌ను అయినా తిక‌మ‌క పెట్టే ర‌షీద్.. బ్యాటింగ్‌లో కూడా అప్పడప్పుడూ మెరుస్తూ ఉంటాడు. ఆల్ రౌండ‌ర్‌ రషీద్‌ ఎక్కువగా 6వ‌ స్థానంలో బ్యాటింగ్‌లో దిగినప్ప‌టికీ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ర‌షీద్ ఖాన్‌కు సంబంధించిన అరుదైన వీడియోను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌) ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.  గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ర‌షీద్ ఖాన్ అఫ్గనిస్తాన్‌ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు.

🚁🤯 #OrangeArmy #SRH @rashid.khan19

A post shared by SunRisers Hyderabad (@sunrisershyd) on

అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా..?ఇక్క‌డ స్పెష‌ల్ ఏంటంటే భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని ఫేవరెట్‌ షాట్లలో ఒకటైన హెలికాప్ట‌ర్ షాట్‌ను ర‌షీద్ ఇర‌గ‌దీశాడు.. దీంతో ధోని ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ అభిమానులు కూడా దీనికి మంత్ర ముగ్ధులయ్యారు. ర‌షీద్‌లో సిన్నర్‌తో పాటు టాలెంటెడ్‌‌ బ్యాట్స్‌మన్ కూడా ఉన్నాడంటూ నెటిజ‌న్లు కొనియాడుతున్నారు. రషీద్‌ను ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌ పంపాల‌ంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ 2017 ఐపీఎల్లో స‌న్ రైజ‌ర్స్ త‌ర‌ఫున ర‌షీద్ అరంగేంట్రం చేశాడు. ప్రతీ సీజన్‌లోనూ తనదైన మార్కును చూపెడుతున్న రషీద్‌.. ఇప్ప‌టి వ‌ర‌కూ 46 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి  6.55 ఎకాన‌మీతో 55 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు