సురేశ్‌ రైనా.. దుబాయ్‌ లైఫ్‌

24 Aug, 2020 12:16 IST|Sakshi

దుబాయ్‌: తన ప్రియనేస్తం, టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే మరో వెటరన్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా కూడా వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించి అందర్నీ విస్మయానికి గురి చేశాడు. ఆగస్టు 15వ తేదీన ధోని రిటైర్మెంట్‌ నిర్ణయం ప్రకటించగా, ఆపై వెంటనే ‘ ఐ వాక్‌ టు యూ’ అన్నట్లు రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. తాను ధోనితో పాటు ఎందుకు రిటైర్మెంట్‌ చేశానో కూడా రైనా వివరించాడు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు అయిన సందర్భంలో ధోని లక్కీ నంబర్‌ ఏడుకు తన జెర్సీ నంబర్‌ మూడును కలుపుతూ వీడ్కోలు తెలిపినట్లు రైనా పేర్కొన్నాడు. కాగా, రైనా ఇప్పుడు ఐపీఎల్‌ ఆడటానికి దుబాయ్‌లో ఉన్నాడు. వచ్చే నెల 19 వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్‌ ఆరంభం కానున్న తరుణంలో రైనా దానికి సన్నద్ధమవుతున్నాడు. ధోనితో కలిసి సీఎస్‌కే తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. (చదవండి: ‘అతనేమీ వార్న్‌ కాదు.. కుంబ్లే అనుకోండి’)

అయితే దుబాయ్‌లోని ఒక లగ్జరీ హోటల్‌లో ఉన్న రైనా.. దానికి సంబంధించిన ఒక వీడియోను షేర్‌ చేశాడు. దుబాయ్‌లో భవనాల ఆకాశహర్మ్యాల నిర్మాణాన్ని కోడ్‌ చేస్తూ అభిమానుల కోసం ఒక పోస్ట్‌ పెట్టాడు. ‘ దుబాయ్‌ లైఫ్‌! వేకింగ్‌ అప్‌ టు దిస్‌ స్కైలైన్‌ ఆఫ్‌ దుబాయ్‌’ అని క్యాప్షన్‌ జోడించాడు. ఐపీఎల్‌-2020లో భాగంగా లగ్జరీ హోటల్‌లో క్వారంటైన్‌ నిబంధనలు పాటిస్తున్న రైనా.. కరోనా వైరస్‌ టెస్టులు చేయించుకున్న తర్వాత సీఎస్‌కేతో కలవనున్నాడు. ఆ మూడు టెస్టుల్లో నెగిటివ్‌ అని తేలితేనే ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లు జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఒకవేళ కరోనా పాజిటివ్‌ వస్తే మళ్లీ హెమ్‌ క్వారంటైన్‌కు వెళ్లక తప్పదు. ప్రస్తుతం యూఏఈలో ఉన్న క్రికెటర్లకు ఎవరికీ కరోనా లేకపోవడంతో వారికి ఈ క్వారంటైన్‌తో వచ్చిన నష్టం ఉండకపోవచ్చు. ప్రస్తుతం ప్రోటాకాల్‌ను పాటిస్తూ స్వీయ నిర్భందంలో ఉండటం ఐపీఎల్‌ నిబంధనల్లో భాగం. (చదవండి: ‘ఇదేనా ధోనికిచ్చే గౌరవం’)

మరిన్ని వార్తలు