ఈనెల 10న భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌

8 Dec, 2023 13:56 IST|Sakshi

ఇటీవలికాలంలో భారత్‌-పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల సంఖ్య బాగా పెరిగింది. వన్డే వరల్డ్‌కప్‌, అంతకుమందు ఆసియాకప్‌ టోర్నీల్లో టీమిండియా పాక్‌తో తలపడింది. ఈ రెండు టోర్నీలకు ముందు (2023, జులై) ఇరు దేశాల ఎమర్జింగ్‌ జట్లు ఆసియా కప్‌ ఫైనల్లో తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్‌పై పాక్‌ 128 పరుగుల తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా నిలిచింది. 

అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా భారత్‌-పాక్‌లు మరోసారి తలపడనున్నాయి. ఈనెల 10న దాయాది జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. వన్డే ఫార్మాట్‌లో సాగనున్న ఈ టోర్నీ ఇవాల్టి (డిసెంబర్‌ 8) నుంచే మొదలైంది. టోర్నీలో భాగంగా ఇవాళ భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌.. నేపాల్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

ఈ టోర్నీలో భారత్‌, పాక్‌తో పాటు మొత్తం ఎనిమిది జట్లు (ఆఫ్ఘనిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, యూఏఈ, శ్రీలంక, జపాన్‌) పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ తొలి దశలో భారత్‌ మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. డిసెంబర్‌ 8న ఆఫ్ఘనిస్తాన్‌, 10న పాకిస్తాన్‌, 12న నేపాల్‌ జట్లతో యంగ్‌ ఇండియా తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్‌ డిసెంబర్‌ 17న జరుగుతుంది. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగనున్నాయి.

భారత అండర్‌-19జట్టు: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్‌), అరవెల్లి అవనీష్ రావు (వికెట్‌కీపర్‌), సౌమీ కుమార్ పాండే (వైస్‌ కెప్టెన్‌), మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్‌కీపర్‌), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ

>
మరిన్ని వార్తలు