నాగిన్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన క్రికెటర్

8 Jan, 2021 16:39 IST|Sakshi

అబుదాబి: షేక్‌ జాయేద్‌ స్టేడియం వేదికగా శుక్రవారం ఐర్లాండ్‌, యూఏఈ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వికెట్‌ తీసిన ఆనందంలో యూఏఈ క్రికెటర్‌ రోహన్‌ ముస్తఫా నాగిన్‌ డ్యాన్స్‌తో అలరించాడు. అసలు విషయంలోకి వెళితే.. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్‌ ముస్తఫా వేశాడు. క్రీజులో ఉన్న ఐర్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ లోక్రాన్‌ టక్కర్‌ బంతి అంచనా వేయడంలో విఫలమై క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆనందంతో ముస్తఫా కొన్ని సెకన్ల పాటు నాగిన్‌ స్టెప్స్‌ వేసి అలరించాడు. అతని చర్యకు ఆశ్చర్యపోయిన తోటి క్రికెటర్లు.. 'నీలో ఈ కళ కూడా ఉందా' అంటూ ముస్తఫాను అభినందించారు.(చదవండి: జడ్డూ లేట్‌ చేసి ఉంటే కథ వేరే ఉండేది)

ఈ వీడియోనూ అబుదాబి క్రికెట్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ముస్తఫా స్టెప్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 50 ఓవర్లు ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ మొదట బ్యాటింగ్‌ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ స్టిర్లింగ్ సెంచరీతో(131*)ఆకట్టుకోగా.. కెప్టెన్‌ ఆండ్రూ బాల్బిర్నీ 53 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన యూఏఈ 18 ఓ‍వర్లో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. (చదవండి: స్లెడ్జింగ్‌; గిల్‌ కౌంటర్‌ అదిరింది..)

మరిన్ని వార్తలు