Vennam Jyothi Surekha: ఆసియా ఆర్చరీ పోటీలకు జ్యోతి సురేఖ 

12 Oct, 2021 07:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మేటి ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ ఆరోసారి ఆసియా సీనియర్‌ ఆర్చరీ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీ నవంబర్‌ 11 నుంచి 19 వరకు ఢాకాలో జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత మహిళల కాంపౌండ్‌ విభాగం జట్టును జంషెడ్‌ పూర్‌లో నిర్వహించిన సెలెక్షన్‌ ట్రయల్స్‌ ఆధారంగా ఎంపిక చేశారు.

ఈ ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ ర్యాంకింగ్‌ రౌండ్‌లో 720 పాయింట్లకుగాను 709 పాయింట్లు స్కోరు చేసింది. రౌండ్‌ రాబిన్‌ ఈవెంట్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో  నెగ్గి టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు తరఫున బరి లోకి దిగిన విజయవాడకు చెందిన జ్యోతి సురేఖకిది ఆరో ఆసియా చాంపియన్‌షిప్‌ కానుంది. గతంలో ఆమె ఐదుసార్లు ఈ ఈవెంట్‌లో పాల్గొని ఎనిమిది పతకాలను సాధించింది. 

చదవండి: Virat Kohli: కెప్టెన్‌గా ఇదే చివరిసారి.. అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం

మరిన్ని వార్తలు