England Tour: ‘బయో బబుల్‌’లోకి కోహ్లి, రోహిత్‌

25 May, 2021 07:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ముంబై సమీప ప్రాంతాల్లో ఉంటున్న భారత క్రికెటర్లు ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన ‘బయో బబుల్‌’ క్వారంటైన్‌లో చేరారు. ఈ జాబితాలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, రోహిత్‌ శర్మ, శార్దుల్‌ ఠాకూర్, జస్‌ప్రీత్‌ బుమ్రా, కోచ్‌ రవిశాస్త్రి ఉన్నారు. ఐపీఎల్‌ సమయంలో కరోనా బారిన పడి కోలుకున్న పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ, వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాలు కూడా సోమవారమే ముంబైలో జట్టుతో కలిశారు. కాగా పది రోజుల క్వారంటైన్‌ తర్వాత వీరందరూ జూన్‌ 2న ఇంగ్లండ్‌కు బయలుదేరుతారు. న్యూజిలాండ్‌తో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడనున్నారు. 

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌
భారత్‌ జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్య రహానే (వైఎస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, విహారి, రిషబ్‌ పంత్(వికెట్‌ కీపర్‌)‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా, ఇషాంత్‌ శర్మ, షమీ, సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్‌‌, ఉమేష్‌ యాదవ్‌

చదవండి: టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఇంగ్లండ్‌ ఫ్లైట్‌ ఎక్కనున్న స్టార్ ప్లేయర్‌
BAN Vs SL:నేనేమీ పొలార్డ్‌ లేదా రస్సెల్‌ కాదు.. కానీ!

మరిన్ని వార్తలు