1000వ పోస్టును షేర్ చేసిన కోహ్లి

23 Jul, 2020 18:56 IST|Sakshi

క్రికెట‌ర్ విరాట్ కోహ్లి త‌న ఇన్‌స్టాగ్రామ్ 1000వ పోస్టును ఫ్యాన్స్‌కు అంకితం చేశాడు. ఈ సంద‌ర్భంగా అభిమానుల‌ను ఉద్దేశించి మీ ప్రేమ‌కు, ఆద‌ర‌ణ‌కు  కృతజ్ఞుడను అంటూ ఎమోష‌నల్ అయ్యారు. ఈ పోస్ట్‌లో కోహ్లి 2008 నాటి మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోను జ‌త‌చేస్తూ 2008 టూ 2020 అంటూ క్యాప్ష‌న్ జోడించారు. విరాట్ చేసిన పోస్టుల్లో ఒకదానికి భార్య అనుష్క శ‌ర్మ స్పందిస్తూ ల‌వ్ సింబ‌ల్‌ను జోడించింది. టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం 2030 దాకా కొన‌సాగించండి అంటూ కామెంట్ చేశారు. అభిమానుల‌కు అంకితం చేస్తూ విరాట్ పెట్టిన పోస్టుకు  ఫ్యాన్స్ కూడా ఎమోష‌న‌ల్ అయ్యారు.  ల‌వ్ యూ విరాట్ స‌ర్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. (ముగింపు బాగుండాల్సింది... టీమిండియా కోచ్‌ పదవిపై అనిల్‌ కుంబ్లే వ్యాఖ్య )

2008లో వ‌న్డే సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన విరాట్ అప్ప‌టినుంచి స‌క్సెస్‌ఫుల్ క్రికెట‌ర్‌గా కెరీర్ కొన‌సాగిస్తున్నాడు. అతి త‌క్కువ కాలంలోనే పలు రికార్డులను బ‌ద్ద‌లు కొట్టి తన మార్క్‌తో ప్రత్యేక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు.  ధోని నుంచి కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు  86 టెస్టులు ఆడి 7240 ప‌రుగులు చేశాడు.  పొట్టి ఫార్మాట్‌లో 2,794 ప‌రుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా విరాట్ కొనసాగుతున్నాడు.

2008 🤜🤛2020 . With many learnings along the way, I'm grateful for your love and support you guys have shown me. ♥️ Here's to the #1000thPost

A post shared by Virat Kohli (@virat.kohli) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా