T20 Blast Tourney: 'క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌' అని ఊరికే అనరు

9 Jun, 2022 19:30 IST|Sakshi

'క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌' అని అంటారు. తాజాగా అది మరోసారి నిరూపితమైంది. విటాలిటీ బ్లాస్ట్‌ టి20 టోర్నీలో భాగంగా లంకాషైర్‌, యార్క్‌షైర్‌ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో క్యాచ్‌ టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. విషయంలోకి వెళితే.. యార్క్‌షైర్‌ విజయానికి ఆఖరి ఓవర్‌లో ఆఖరి బంతికి ఆరు పరుగులు కావాలి. క్రీజులో డొమినిక్‌ డ్రేక్స్‌ ఉన్నాడు. అవతలి ఎండ్‌లో డానీ లాంబ్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు.

సిక్స్‌ కొడితే మ్యాచ్‌ విన్‌ అవుతుంది.. లేదంటే యార్క్‌షైర్‌కు ఓటమి తప్పదు. ఈ దశలో డానీ లాంబ్‌ పూర్తిగా ఆఫ్‌ స్టంప్‌ అవతల బంతిని విసిరాడు. అయితే డొమినిక్‌ డ్రేక్స్‌ డీమ్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. అతని టైమింగ్‌ షాట్‌ చూసి అంతా సిక్స్‌ అని భావించారు. ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. బౌండరీ లైన్‌ వద్ద టామ్‌ హార్ట్లే సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే లైన్‌ తొక్కాడేమోనన్న చిన్న అనుమానం ఉండడంతో ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌ను ఆశ్రయించాడు. రిప్లేలో టామ్‌ హార్టీ చిన్న మిస్టేక్‌ కూడా చేయకుండా క్యాచ్‌ను ఒడిసిపడినట్లు తేలడంతో ఔట్‌ ఇచ్చాడు. దీంతో యార్క్‌షైర్‌ విజయానికి ఆరు పరుగుల దూరంలో ఆగిపోయింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన లంకాషైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌(32 బంతుల్లో 66), క్రాప్ట్‌ 41, జెన్నింగ్స్‌ 42 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన యార్క్‌షైర్‌ ఇన్నింగ్స్లో టామ్‌ కోహ్లెర్‌ 77, డేవిడ్‌ విల్లీ 52 పరుగులతో మెరిసినప్పటికి లాభం లేకుండా పోయింది.

చదవండి: European T10 League: హతవిధి.. నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని స్థితిలో!

మరిన్ని వార్తలు