ఇలాంటి కీపర్‌ ఉంటే అంతే సంగతులు

29 Oct, 2020 19:45 IST|Sakshi

ఒక బంతికి మూడు పరుగులు చేస్తే మ్యాచ్‌ గెలుస్తారు.. అదే రెండు పరుగులు చేస్తే టై అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో బ్యాటింగ్‌ చేస్తున్న జట్టు గెలిచే అవకాశం లేకుంటే కనీసం టై చేసుకోవాలని చూస్తుంది. సరిగ్గా ఇలాంటి స్థితిలోనే బ్యాట్స్‌మెన్‌ బంతిని కొట్టాడు. కానీ అది ఎక్కువ దూరం పోలేదు. కీపర్‌ దాన్ని అందుకొని నేరుగా వికెట్లను గిరాటేయకుండా స్టంప్స్‌ వద్దకు పరుగెత్తుకొచ్చాడు. కానీ అప్పటికే నాన్‌ స్ట్రైకర్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజులోకి దూసుకొచ్చేశాడు. ఈ క్షణంలో మ్యాచ్‌ గెలిచామని భావించిన కీపర్‌ ఆలోచనలో పడిపోయాడు. అయితే నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ వెంటనే స్పందిస్తూ మరో పరుగుకు ప్రయత్నించాడు. స్ట్రైకింగ్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజు నుంచి కదిలేలోపే అవతలి ఎండ్‌ బ్యాట్స్‌మెన్‌ వేగంగా రెండో ఎండ్‌కు చేరుకున్నాడు. (చదవండి : 'బయోబబుల్ నరకం.. కౌంట్‌డౌన్ మొదలెట్టా')

దీంతో  స్ట్రైకింగ్‌ బ్యాట్స్‌మెన్‌ పరిగెత్తడంతో కీపర్‌ బౌలర్‌కు బాల్‌ను విసిరాడు. కానీ బౌలర్‌ విసిరిన బంతి వికెట్లు తాకలేదు. దీంతో బ్యాటింగ్‌ జట్టు మ్యాచ్‌ను టై చేసుకొని గోల్డన్‌ బాల్‌కు వెళ్లింది( ఇది కూడా ఒక సూపర్‌ ఓవర్‌ లాగా). గోల్డ్‌న్‌ బాల్‌ రూల్‌ ఏంటంటే.. సెకండ్‌ బ్యాటింగ్‌ చేసిన జట్టుకు ఒక బంతిని ఆడే అవకాశం ఇస్తారు. ఆ బంతికి వారు రెండు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే విజయం సాధించినట్టు లెక్క. ఈ గోల్డన్‌ బాల్‌ రూల్‌లో బ్యాటింగ్‌ జట్టు కేవలం ఒక్కపరుగే చేయడంతో ఓటమి పాలయింది. కీపర్‌ పరధ్యానంతో మ్యాచ్‌ టై అయి గోల్డన్‌బాల్‌కు వెళ్లినా బౌలింగ్‌ జట్టే మ్యాచ్‌ను గెలవడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో అయితే మాత్రం ఇలాంటి వాటికి ఆస్కారం ఉండదు. మరి ఇలాంటి వింత ఆటను ఎక్కడ చూశామనేగా మీ డౌటు. (చదవండి : సూర్య అద్భుతం.. కానీ నిరాశలో ఉన్నాడు)

వెంటనే యూరోపియన్‌ క్రికెట్‌ ఇండోర్‌ సిరీస్‌కు వెళితే ఈ విషయం అర్థమవుతుంది. యూరోపియన్‌ సిరీస్‌లో భాగంగా కాటలున్యా టైగర్స్‌, పాక్సీలోనా మధ్య టీ10 మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన కాటలున్యా టైగర్స్‌ 10 ఓవర్లో 107 పరగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్సీలోనా చివరి ఓవర్‌ చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సిన దశలో నిలిచింది. కీపర్‌ పరధ్యానంతో మ్యాచ్‌ను టై చేసుకున్న పాక్సీలోనా గోల్డన్‌ బాల్‌కు వెళ్లింది. అయితే అనూహ్యంగా పాక్సీలోనా ఒకటే పరుగు చేయడంతో కాటలున్యా టైగర్స్‌ విజయం సాధించింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఇలాంటివి ఇండోర్‌ క్రికెట్‌లో మాత్రమే సాధ్యమవుతాయి... ఇలాంటి కీపర్‌ ఉంటే అంతే సంగతులు అని కామెంట్లు పెడుతున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా