97 పరుగులకే విండీస్‌ ఆలౌట్‌

11 Jun, 2021 08:29 IST|Sakshi

జోహెన్నెస్‌బర్గ్‌: వెస్టిండీస్‌ జట్టు దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అత్యల్ప స్కోరును నమోదు చేసింది.  గురువారం గ్రాస్‌ ఐలెట్‌లో ప్రారంభమైన తొలి టెస్టులో వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులకే కుప్పకూలింది. టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై విండీస్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ (20) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఇన్‌గిడి కేవలం 19 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా.. ఆన్‌రిచ్‌ నోర్జే 4 కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు.

అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా తొలిరోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. మక్రమ్‌ 60 పరుగులు చేసి ఔట్‌ కాగా.. ప్రస్తుతం వాండర్‌ డుసెన్‌ 34, క్వింటన్‌ డికాక్‌ 4 పరుగులతో ఆడుతున్నారు. విండీస్‌ బౌలర్లలో జైడెన్ సీల్స్ 3 వికెట్లు తీశాడు.
చదవండి: కెప్టెన్‌గా గబ్బర్‌.. వైస్‌కెప్టెన్‌గా భువీ

అత్యధిక టెస్టులు ఆడిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా..
ఎడ్జ్‌బాస్టన్‌: న్యూజిలాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (81) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, డాన్‌ లారెన్స్‌ (67 బ్యాటింగ్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఎజాజ్, బౌల్ట్, హెన్రీతలా 2 వికెట్లు తీశారు.  ఈ మ్యాచ్‌ ద్వారా అత్యధిక టెస్టులు ఆడిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌ (162)గా పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ గుర్తింపు పొందాడు. అలిస్టర్‌ కుక్‌ (161)ను అతను అధిగమించాడు.  

చదవండి: కోహ్లి నా దగ్గరికి వచ్చేవరకు ప్లాన్స్‌ చెప్పను: రహానే

మరిన్ని వార్తలు