World Cup 2023: సారీ సఫారీ... ఆసీస్‌ ఎనిమిదోసారి

17 Nov, 2023 04:31 IST|Sakshi
క్లాసెన్‌ వికెట్‌ తీశాక హెడ్‌కు సహచరుల అభినందన

ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా

ఉత్కంఠభరిత సెమీఫైనల్లో విజయం

3 వికెట్లతో ఓడిన దక్షిణాఫ్రికా

డేవిడ్‌ మిల్లర్‌ శతకం వృథా

కమిన్స్‌ బృందం సమష్టి ప్రదర్శన

ఆదివారం ఫైనల్లో భారత్‌తో అమీతుమీ   

ఎన్ని మలుపులు... ఎంత ఒత్తిడి... గడియారపు లోలకంలా చేతులు మారుతూ వచ్చిన ఆధిపత్యం... కుప్పకూలిపోతున్న దశ నుంచి కోలుకున్న జట్టు... అయినా సరే తక్కువ స్కోరుతో కట్టడి చేశామనే సంబరం... మెరుపు ఆరంభంతో సునాయాసం అనుకున్న విజయం... కానీ ఆపై ప్రతీ బంతి ప్రమాదకరంగా మారి వికెట్‌ కాపాడుకుంటే చాలనే స్థితి... టెస్టు మ్యాచ్‌ తరహా సీమ్‌ బౌలింగ్‌... టెస్టుల్లాగే ఫీల్డింగ్‌ ఏర్పాట్లు... ఒక వన్డే మ్యాచ్‌లో ఇవన్నీ కనిపించాయి... పేరుకే తక్కువ స్కోర్ల మ్యాచే కానీ తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలు... అదీ ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ అంటే ఆ లెక్కే వేరు... అది కూడా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌ అంటే అనూహ్యానికి లోటుండదు... తొలి ఇన్నింగ్స్‌ స్కోరుతో 1999 ప్రపంచకప్‌ సెమీస్‌ను గుర్తుకు తెచి్చన పోరు చివరకు ఆసీస్‌ పరమైంది... ప్రమాదాన్ని తప్పించుకొని ఎట్టకేలకు గట్టెక్కిన ఆ్రస్టేలియా ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే తుది పోరులో భారత్‌తో ‘ఢీ’కి సిద్ధమైంది.


దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్‌... 11.5 ఓవర్లలోనే స్కోరు 24/4... ఇక ఆట ముగిసినట్లే అనిపించింది... కానీ ఆసీస్‌ పట్టు విడిచింది. మిల్లర్‌ అద్భుత సెంచరీతో స్కోరు 212 వరకు చేరింది... ఎలా చూసినా సునాయాస లక్ష్యమే... ఆసీస్‌ అంచనాలకు తగినట్లుగా 6 ఓవర్లలో 60/0... ఇలాంటి తరుణంలో సఫారీ బౌలర్ల జోరు మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు ఒక్క సింగిల్‌ తీయడానికి కూడా ఆసీస్‌ బ్యాటర్లు బెదిరే స్థితి వచి్చంది... స్పిన్‌తో కేశవ్‌ మహరాజ్, షమ్సీ భయపెట్టించేశారు. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై పరుగులు చేయలేక కంగారూలపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు స్మిత్‌ కూడా కీలక స్థితిలో చెత్త షాట్‌తో పరిస్థితిని దిగజార్చాడు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో చివరి వరుస బ్యాటర్లు సాహసాలు చేయలేదు. ఆఖరికి మరో 16 బంతులు మిగిలి ఉండగా మాజీ చాంపియన్‌ విజయ తీరం చేరింది. చివరి వరకూ పోరాడినా... కీలకదశలో క్యాచ్‌లు వదిలేసి... మరోసారి దురదృష్టాన్ని భుజాన వేసుకొని తిరిగిన దక్షిణాఫ్రికా సెమీస్‌కే పరిమితమై నిరాశగా ని్రష్కమించింది.   

కోల్‌కతా: ఐదుసార్లు వరల్డ్‌కప్‌ విజేత ఆ్రస్టేలియా మరో టైటిల్‌ వేటలో ఫైనల్‌కు చేరింది. ఆదివారం భారత్‌తో తుది సమరంలో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆ్రస్టేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్‌ మిల్లర్‌ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించగా... హెన్రీ క్లాసెన్‌ (48 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. స్టార్క్, కమిన్స్‌ చెరో 3 వికెట్లు...హాజల్‌వుడ్, ట్రవిస్‌ హెడ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ట్రవిస్‌ హెడ్‌ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడైన ఆటతో ఆసీస్‌ విజయానికి పునాది వేయగా... స్టీవ్‌ స్మిత్‌ (62 బంతుల్లో 30; 2 ఫోర్లు), డేవిడ్‌ వార్నర్‌ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో భారత్‌తో ఆ్రస్టేలియా తలపడుతుంది.  

మిల్లర్‌ మినహా...
ఈడెన్‌ గార్డెన్స్‌లోనే భారత్‌తో మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదిస్తూ కుప్పకూలిన అనుభవంతో కావచ్చు దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే మబ్బులు పట్టిన వాతావరణంలో ఈ నిర్ణయం కలిసి రాలేదు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ఆసీస్‌ బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీ జట్టు 12 ఓవర్ల లోపే 4 వికెట్లు కోల్పోయింది. బవుమా (0), డి కాక్‌ (3), మార్క్‌రమ్‌ (10), డసెన్‌ (6) విఫలమయ్యారు. ఈ స్థితిలో జట్టు కుప్పకూలుతుందేమో అనిపించినా... క్లాసెన్, మిల్లర్‌ కలిసి ఆదుకున్నారు. కొద్దిసేపు మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించినా... ఆట కొనసాగిన తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 70 బంతుల్లో మిల్లర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. ఐదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం తర్వాత పార్ట్‌టైమ్‌ బౌలర్‌ ట్రవిస్‌ హెడ్‌ సఫారీలను దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో క్లాసెన్, జాన్సెన్‌ (0)లను పెవిలియన్‌ పంపడంతో జట్టు వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిల్లర్‌ ఒక్కడే బాధ్యతను తీసుకున్నాడు. జంపా బౌలింగ్‌లోనే అతను నాలుగు సిక్సర్లు బాదటం విశేషం. మిల్లర్‌కు కొయెట్జీ (19) కొద్దిసేపు సహకరించాడు. కమిన్స్‌ వేసిన 48వ ఓవర్‌ తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలచిన మిల్లర్‌ 115 బంతుల్లో శతకం సాధించగా, ఇదే షాట్‌తో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది.  

కలిసొచి్చన శుభారంభం...
స్వల్ప లక్ష్యమే అయినా ఆ్రస్టేలియా దూకుడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించింది. అదే చివరకు ఆ జట్టు విజయానికి పునాది వేసింది. హెడ్, వార్నర్‌ పోటీపడి పరుగులు సాధించడంతో 6 ఓవర్లలోనే స్కోరు 60 పరుగులకు చేసింది. రబడ బౌలింగ్‌లోనే వార్నర్‌ 3 సిక్స్‌లు బాదాడు. అయితే వరుస ఓవర్లలో వార్నర్, మార్‌‡్ష (0)లను అవుట్‌ చేసి సఫారీ కాస్త పైచేయి ప్రదర్శించింది. కొయెట్జీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాది హెడ్‌ 40 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. హెడ్‌ క్రీజ్‌లో ఉన్నంతసేపు ఆసీస్‌ ధీమాగానే ఉంది. అయితే దక్షిణాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లు షమ్సీ, మహరాజ్‌లతో బౌలింగ్‌ మొదలు పెట్టిన తర్వాత కంగారూల్లో తడబాటు మొదలైంది. ఈడెన్‌ పిచ్‌పై అనూహ్యంగా టర్న్‌ అవుతున్న బంతి బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఆసీస్‌ ఒక్కో పరుగు తీయడానికి తీవ్రంగా శ్రమించింది. తన తొలి బంతికే హెడ్‌ను మహరాజ్‌ బౌల్డ్‌ చేయగా... షమ్సీ బౌలింగ్‌లో లబుõÙన్‌ (18), మ్యాక్స్‌వెల్‌ (1) అనవసరంగా చెత్త షాట్‌లు ఆడి వికెట్లు సమరి్పంచుకున్నారు.

దాంతో సఫారీలు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్‌గ్లిస్‌ (49 బంతుల్లో 28; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 37 పరుగులు జోడించి స్మిత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే కొయెట్జీ అద్భుత బౌలింగ్‌తో తక్కువ వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్‌ పంపడంతో పరిస్థితి మళ్లీ మారింది. అయితే స్టార్క్‌ (16 నాటౌట్‌), కమిన్స్‌ (14 నాటౌట్‌) జాగ్రత్తగా ఆడుతూ అభేద్యంగా 22 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.  

స్కోరు వివరాలు  
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) కమిన్స్‌ (బి) హాజల్‌వుడ్‌ 3; బవుమా (సి) ఇన్‌గ్లిస్‌ (బి) స్టార్క్‌ 0; డసెన్‌ (సి) స్మిత్‌ (బి) హాజల్‌వుడ్‌ 6; మార్క్‌రమ్‌ (సి) వార్నర్‌ (బి) స్టార్క్‌ 10; క్లాసెన్‌ (బి) హెడ్‌ 47; మిల్లర్‌ (సి) హెడ్‌ (బి) కమిన్స్‌ 101; జాన్సెన్‌ (ఎల్బీ) (బి) హెడ్‌ 0; కొయెట్జీ (సి) ఇన్‌గ్లిస్‌ (బి) కమిన్స్‌ 19; కేశవ్‌ మహరాజ్‌ (సి) స్మిత్‌ (బి) స్టార్క్‌ 4; రబడ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) కమిన్స్‌ 10; షమ్సీ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్‌) 212.
వికెట్ల పతనం: 1–1, 2–8, 3–22, 4–24, 5–119, 6–119, 7–172, 8–191, 9–203, 10–212.
బౌలింగ్‌:
స్టార్క్‌ 10–1–34–3, హాజల్‌వుడ్‌ 8–3–12–2, కమిన్స్‌ 9.4–0–51–3, జంపా 7–0–55–0, మ్యాక్స్‌వెల్‌ 10–0–35–0, హెడ్‌ 5–0–21–2.

ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి) మహరాజ్‌ 62; వార్నర్‌ (బి) మార్క్‌రమ్‌ 29; మార్‌‡్ష (సి) డసెన్‌ (బి) రబడ 0; స్మిత్‌ (సి) డికాక్‌ (బి) కొయెట్జీ 30; లబుõÙన్‌ (ఎల్బీ) (బి) షమ్సీ 18; మ్యాక్స్‌వెల్‌ (బి) షమ్సీ 1; ఇన్‌గ్లిస్‌ (బి) కొయెట్జీ 28; స్టార్క్‌ (నాటౌట్‌) 16; కమిన్స్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (47.2 ఓవర్లలో 7 వికెట్లకు) 215.
వికెట్ల పతనం: 1–60, 2–61, 3–106, 4–133, 5–137, 6–174, 7–193.
బౌలింగ్‌: జాన్సెన్‌ 4.2–0–35–0, రబడ 6–0–41–1, మార్క్‌రమ్‌ 8–1–23–1, కొయెట్జీ 9–0–47–2, షమ్సీ 10–0–42–2, మహరాజ్‌ 10–0–24–1.   

8: వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరడం ఆస్ట్రేలియా జట్టుకిది ఎనిమిదోసారి. గతంలో ఆ జట్టు 1975 (రన్నరప్‌), 1987 (విజేత), 1996 (రన్నరప్‌), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో ఏడుసార్లు టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, రెండుసార్లు రన్నరప్‌ తో సంతృప్తి పడింది.
5: వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఐదో సెమీఫైనల్‌ ఆడిన దక్షిణాఫ్రికా ఐదుసార్లు ఈ అడ్డంకిని దాటలేకపోయింది. 1992లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోగా... 1999లో ఆ్రస్టేలియాతో సెమీఫైనల్‌ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ‘టై’ చేసుకుంది. అయితే ‘సూపర్‌ సిక్స్‌’ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు ఆ్రస్టేలియా ఫైనల్‌ చేరింది. దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది. 2007లో ఆ్రస్టేలియా చేతిలోనే సెమీఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా... 2015లో న్యూజిలాండ్‌ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తాజాగా ఆస్ట్రేలియా చేతిలో మరోసారి ఓడిపోయింది.
1: భారత గడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాను ఓడించడం ఆ్రస్టేలియాకిదే తొలిసారి కావడం విశేషం. 1996లో భారత్‌ వేదికగా
జరిగిన టైటాన్‌ కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో మూడుసార్లు ఓడిన ఆస్ట్రేలియా.. తాజా ప్రపంచకప్‌లో లీగ్‌ దశలో ఓటమి పాలైంది. అయితే కీలకమైన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఆ్రస్టేలియా ఓడించింది.

2: వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్స్‌ జరగనుండటం ఇది రెండోసారి. 1996, 2007 ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా... ఆస్ట్రేలియా–భారత్‌ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్‌ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్‌ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. 

మరిన్ని వార్తలు