ఉద్యోగినిపై వేధింపులు.. దిశ పోలీసులకు కాల్‌.. ఆరు నిమిషాల్లోనే

25 May, 2023 12:06 IST|Sakshi

శ్రీకాకుళం: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన దిశ చట్టం, ఎస్‌ఓఎస్‌ యాప్‌ సత్ఫలితాలనిస్తున్నాయి. తాజాగా పొందూరు మండలంలో బుధవారం జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. పొందూరు మండలంలో పనిచేస్తున్న ఉద్యోగినిని రణస్థలం మండలం కోటపాలెం సచివాలయం ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ఎ.ధర్మారావు వేధింపులకు గురిచేశాడు.

బైక్‌పై ఉద్యోగానికి వెళ్తున్న యువతిని రాపాక జంక్షన్‌ వద్ద అడ్డగించి బెదిరించాడు. వెంటనే అమ్మాయి ప్రాణభయంతో దిశ ఎస్‌వోఎస్‌కు కాల్‌ చేసి సహాయం కోరింది. దీంతో ఆరు నిమిషాల్లో సంఘటనా స్థలానికి దిశ పోలీసులు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని బాధితురాలికి భరోసా కల్పించారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు :


Advertisement

ASBL
మరిన్ని వార్తలు