21 నుంచి 3వ జోన్‌ గ్రిగ్స్‌ పోటీలు | Sakshi
Sakshi News home page

21 నుంచి 3వ జోన్‌ గ్రిగ్స్‌ పోటీలు

Published Sat, Nov 18 2023 12:34 AM

 ఎం.బాలకృష్ణ - Sakshi

గార: కె.మత్స్యలేశం బుద్ధా పాఠశాలలో ఈ నెల 21 నుంచి 3వ జోన్‌ గ్రిగ్స్‌ పోటీలు జరుగుతాయని జిల్లా ఉపవిద్యాశాఖాధికారి ఎస్‌.తిరుమలచైతన్య, జిల్లా పాఠశాలల క్రీడల సంఘ సహాయ కార్యదర్శి కె.మాధవరావులు తెలిపారు. ఈ పోటీలకు శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గ పాఠశాలల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఇటీవల జరిగిన గ్రిగ్స్‌ పోటీల్లో గెలుపొందిన రన్నర్లు, విన్నర్లు బాలబాలికల జట్లు పాల్గొనాలని తెలిపారు. వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, టెన్నీ కాయిట్‌, షటిల్‌ క్రీడల పోటీలు జరుగుతాయన్నారు. ఇక్కడ గెలుపొందిన వారు డిసెంబర్‌లో నిర్వహించనున్న జిల్లాస్థాయి గ్రిగ్స్‌ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. 21, 22వ తేదీల్లో బాలురు, 23, 24వ తేదీల్లో బాలికలు పోటీలు నిర్వహించడం జరగుతుందన్నారు.

జాతీయ కబడ్డీ పోటీలకు

ఏఎన్‌యూ కోచ్‌గా బాలకృష్ణ

శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ సౌత్‌జోన్‌ అంతర్‌యూనివర్సిటీ మహిళల కబడ్డీ పోటీలకు కోచ్‌గా జిల్లాకు చెందిన ఎన్‌ఐఎస్‌ క్వాలిఫైడ్‌ కబడ్డీ కోచ్‌ ఎం. బాలకృష్ణ నియామకమయ్యారు. ఈ పోటీల్లో పాల్గొనే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(ఏఎన్‌యూ), గుంటూరు మహిళల జట్టుకు కోచ్‌గా ఈయనను నియమిస్తూ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ డాక్టర్‌ పి.జాన్సన్‌ ఉత్తర్వులు వెలువరించారు. ఈ పోటీలు ఈ నెల 22 నుంచి 25 వరకు తమిళనాడు రాష్ట్రం అలగప్పా యూనివర్సిటీ వేదికగా జరగనున్నాయి. బాలకృష్ణ శ్రీకాకుళం నగరంలోని సన్‌ డిగ్రీ కళాశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌ పనిచేస్తున్నారు.

టీ–20 రాష్ట్ర క్రికెట్‌ జట్టుకు నవ్య ఎంపిక

నరసన్నపేట: ఏసీఏ ఆధ్వర్యంలో అండర్‌–23 మహిళల టీ ట్వంటీ రాష్ట్ర క్రికెట్‌ జట్టుకు నరసన్నపేటకు చెందిన బూసి నవ్య ఎంపికై ంది. నవ్య బౌలింగ్‌, బ్యాటింగ్‌లలో సత్తా చాటుతోంది. ఎంపికపై జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ సభ్యులు గొద్దు చిట్టిబాబు నవ్యను అభినందించారు. నవ్య కోచింగ్‌ కోసం మంగళగిరికి శుక్రవారం పయనమైంది.

పెట్రోల్‌ బంకులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

సీతంపేట: ఐటీడీఏ ఆధ్వర్యంలో పాలకొండలో త్వరలో నిర్వహించనున్న పెట్రోల్‌ బంకులో ఉద్యోగాలకు గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐటీడీఏ పీఓ కల్పనాకుమారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గౌరవ వేతనంపై పనిచేయడానికి సూపర్‌వైజర్‌ ఒక పోస్టుకు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలన్నారు. పంప్‌బాయ్‌ 7 పోస్టులకు ఇంటర్మీడియెట్‌ అర్హత ఉండాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట, పాలకొండ, వీరఘట్టం, భామిని మండలాలు, శ్రీకాకుళం జి ల్లాలో కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మందస, మెళియాపుట్టి, కంచిలి, సోంపేట, పలాస, టెక్కలి, నందిగాం, జలుమూరు, బూర్జ, లావేరు, సురుబుజ్జిలి, ఎల్‌.ఎన్‌.పేట మండలాలకు చెందిన పరిసర గ్రామాల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు ఈ నెల 27లోగా ఐటీడీఏలోని పరిపాలనాధికారి కార్యాలయానికి అందజేయాలన్నారు.

నవ్య
1/1

నవ్య

Advertisement
Advertisement