రామ్మా పింఛన్‌ తీసుకో..

6 Sep, 2023 11:08 IST|Sakshi

శ్రయం అన్నది లేకుండా ఓ చోట తింటూ, మరో చోట ఉంటూ బతుకుతున్న ఓ యాచకురాలికి ప్రతి నెలా పింఛన్‌ మాత్రం ఠంచన్‌గా అందిస్తున్నా రు. వలంటీర్‌ వ్యవస్థ చేసిన మేలు ఇది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన బొచ్చ కాంతమ్మకు మతిస్థిమితం లేక, అనారోగ్యంతో బాధ పడుతుండడంతో జంట పట్టణాల్లో తిరుగుతూ ఎవరైనా భోజనం పెడితే తింటూ ఉండేది.

ఇప్పుడు పింఛన్‌ డబ్బుతో కడుపు నింపుకుంటోంది. మంగళవా రం పలాస ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా వలంటీర్‌ పట్ట చైతన్య, గొడగలవీధి కార్యదర్శి పాలక మినర్వా సమక్షంలో వేలిముద్రలు తీసుకుని పింఛన్‌ అందించారు. – కాశీబుగ్గ

మరిన్ని వార్తలు