‘సీఎం వైఎస్‌ జగన్‌ స్ఫూర్తితో రేవతీపతి ట్రస్టు సేవలు’ | Sakshi
Sakshi News home page

‘సీఎం వైఎస్‌ జగన్‌ స్ఫూర్తితో రేవతీపతి ట్రస్టు సేవలు’

Published Tue, Nov 21 2023 1:58 AM

- - Sakshi

టెక్కలి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల స్ఫూర్తితో దివంగత టెక్కలి ఎమ్మెల్యే కొర్ల రేవతీపతి మెమోరియల్‌ ట్రస్టు సేవలు కొనసాగిస్తున్నట్లు ట్రస్టు చైర్మన్‌ కొర్ల శిరీష శ్రీనివాస్‌ వెల్లడించారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం వివిధ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను, బీరువాను కొర్ల రేవతీపతి ట్రస్టు ద్వారా సోమవారం అందజేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమార్‌, వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజవకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. ముందుగా ఎమ్మెల్సీ దువ్వాడ మాట్లాడుతూ ట్రస్టు ద్వారా సమకూర్చిన పోటీ పరీక్షల పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమార్‌ మాట్లాడుతూ లక్ష్యం దిశగా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్త వాణి మాట్లాడుతూ ప్రస్తుతం సెల్‌ఫోన్‌ యుగంలో సైతం పుస్తకాలకు ఎంతో విలువ ఉందన్నారు. రేవతీపతి ట్రస్టు ద్వారా మంచి కార్యక్రమాన్ని నిర్వహించారని ఆమె పేర్కొన్నారు.

అనంతరం ట్రస్టు చైర్మన్‌ కొర్ల శిరీషా శ్రీనివాస్‌ మాట్లాడుతూ తన తండ్రి దివంగత ఎమ్మెల్యే కొర్ల రేవతీపతి ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్‌ జగన్‌ స్ఫూర్తితో తమ ట్రస్టు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. సివిల్స్‌ సాధనలో భాగంగా విద్యార్థులకు అండగా నిలుస్తామని అన్నారు. కళాశాల గ్రంథాలయంలో నిత్యం పుస్తక పఠనం చేసిన విద్యార్థులకు ట్రస్టు ద్వారా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఎంపీపీ ఎ.సరోజనమ్మ, డాక్టర్‌ దువ్వాడ హైందవి, ప్రిన్సిపాల్‌ టి.గోవిందమ్మ, వైస్‌ ప్రిన్సిపాల్‌ బి.సతీష్‌కుమార్‌, స్థానిక నాయకులు హెచ్‌.ఉదయ్‌భాస్కర్‌, మోహన్‌, రాహుల్‌, అప్పలరెడ్డి, రేవతిపతి ట్రస్టు ఆర్గనైజర్‌ చిగిలిపల్లి శ్రీనివాస్‌, స్థానిక నాయకులు ఉదయ భాస్కర్‌, పీవీజీ గుప్తాతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

1/1

Advertisement
Advertisement