శ్రీశైలంలో 8 గేట్ల ఎత్తివేత 

20 Aug, 2022 01:46 IST|Sakshi
(ఫైల్‌) 

దోమలపెంట/గద్వాల రూరల్‌: ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని జూరాల, సుంకేశుల జలాశయాల నుంచి శ్రీశైలానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో శుక్రవారం ఆనకట్ట వద్ద ఎనిమిది గేట్లను పైకెత్తారు. స్పిల్‌వే, విద్యుదు త్పత్తి ద్వారా కలిపి 2,86,529 క్యూసె క్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

జూరాల, సుంకేశులతో కలిపి మొత్తం 2,45,590 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. ఎగు వ నుంచి 2.10 లక్షల క్యూసెక్కుల ప్రవా హం వస్తుండటంతో 40 గేట్లు పైకె త్తి శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు.

మరిన్ని వార్తలు