‘గుట్ట’ సబ్‌ రిజిస్ట్రార్‌ ఇంట్లో  ముగిసిన సోదాలు 

31 Jul, 2021 02:05 IST|Sakshi
యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ ఇంట్లో లభించిన నగదు

రూ.76 లక్షలకుపైగా నగదు, 27 తులాల ఆభరణాలు స్వాధీనం

యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు శుక్రవారం ముగిశాయి. మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.20 వేలు డిమాండ్‌ చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ దేవానంద్‌.. స్థానిక డాక్యుమెంట్‌ రైటర్‌ ప్రభాకర్‌ను మధ్యవర్తిగా పెట్టి  లంచం తీసుకున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్న విషయం విదితమే. కాగా, దేవానంద్‌ ఇంట్లో రూ.76 లక్షలకుపైగా నగదు, 27 తులాల బంగారు ఆభరణాలు, 7.9 ఎకరాల పొలం, 200 గజాల ప్లాట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు, తొమ్మిది విదేశీమద్యం బాటిళ్లు, పలు ఇతర కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవానంద్, ప్రభాకర్‌లను ఏసీబీ జిల్లా ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్, మెదక్‌ డీఎస్పీ ఆనంద్‌ ఆధ్వర్యంలో విచారించారు. వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు