TS: నూతన సచివాలయ భవనం ఏరియల్‌ వ్యూ అదిరిందిగా..

20 Feb, 2023 16:44 IST|Sakshi

హుస్సేన్ సాగర్ తీరాన ఒక పక్క జ్జానబోధి బుద్ధుడు, మరో పక్క రాజ్యాంగ నిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డా. బిఆర్ అంబేద్కర్, ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలు. కనీవిని ఎరుగని రీతిలో, అత్యంత వైభవోపేతంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటేలా ప్రారంభోత్సవానికి సిద్ధమైన తెలంగాణ ప్రజాపాలనా సౌధం.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయం భవనం.

తెలంగాణ కొత్త సచివాలయం ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేశారు. కానీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుక వాయిదా పడిన సంగతి పక్కనపెడితే.. హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ట్యాంక్‌ బండ్‌ పరిసరాలను ప్రభుత్వం అత్యంత సుందరరీకరణగా తీర్చిదిద్దుతోంది. ఒకవైపు సచివాలయ నిర్మాణం ఇప్పటికే తుది మెరుగులు దిద్దుకోగా, ట్యాంక్‌ బండ్‌ పరిసరాలు కొత్త రూపును సంతరించుకోనున్న క్రమంలో ఆ ప్రాంతం మరింత ఆహ్లాదంగా మారనుంది.  ఇందుకు నూతన సచివాలయం యొక్క ఏరియల్‌ వ్యూనే సాక్షంగా నిలుస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరిన్ని వార్తలు