హిందూ జాతీయవాదుల దాడులను తిప్పికొట్టాలి: చాడ  

12 Nov, 2021 03:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదాలపై బీజేపీకి చెందిన హిందూ జాతీయవాదుల దాడులను తిప్పికొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరగబోయే అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభల సన్నాహక కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ, పాలనలో మార్పు రావడానికి దేశ యువత బాధ్యతాయుతమైన భాగస్వాములుగా మారాలని అయన అన్నారు.

కేంద్రంలోని నిరంకుశ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్ర వేస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.బోస్, అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.తిరుమలై, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌ మరుపాక, ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ నాయకులు బి.స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆనాడు వద్దన్న ధర్నా చౌక్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి నేడు ముద్దుగా కనిపిస్తుందని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిషేధించిందని, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్య ఉద్యమాల ద్వారా ధర్నా చౌక్‌ను తిరిగి సాధించుకున్నాయన్నారు. ఆనాడు వద్దన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, నేడు అదే ధర్నా చౌక్‌లో కావల్సి వచ్చిందన్నారు.  

ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: చాడ 
సింగరేణి కాలరీస్‌ యాజ మాన్యం తప్పిందంతో శ్రీరాంపూర్‌ బొగ్గుగనిలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందా రాని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కో రారు. రక్షణ చర్యలు చేపట్టకుండా కార్మికులను విధుల్లోకి పంపడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు.

యాజమాన్యం తప్పించుకొని అధికారుల మీద తప్పును తోయడం సరైంది కాదని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఘటనపై సీఎం కేసీఆర్‌ స్పందించి మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు