పొలిటికల్‌ గేమ్‌.. 12 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు: బండి సంజయ్‌

5 Aug, 2022 02:28 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: టీఆర్‌ఎస్‌ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శివారులో జర్నలిస్టులతో ఏర్పాటు చేసిన ఇష్టాగోష్టిలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో మును గోడు తరహాలోనే రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాడుతున్నారని.. అదే సమయంలో ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారని గుర్తు చేశారు.

టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేసీఆర్‌ కుటుంబంపై అనేక ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి ఆయా ఎమ్మెల్యేలు వచ్చార న్నారు. చీకోటి ప్రవీణ్‌ దందా వెనుక కేసీఆర్‌ కుటుంబంతో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హస్తం ఉందని ఆరో పించారు. ప్రస్తుతం వారంతా పారిపోయారన్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీకి 62 సీట్లతోపాటు 47 నుంచి 53 శాతం ఓట్లు వస్తాయని వివిధ సర్వే సంస్థల నివేదికల్లో వెల్లడైందన్నారు. 

పార్టీ టికెట్లు అధిష్టానమే నిర్ణయిస్తుంది.. 
బీజేపీలో వ్యక్తిగత ఇమేజ్‌కోసం పనిచేసే వారికి స్థానంలేదని, టికెట్లు పార్టీ అధిష్టా నమే నిర్ణయిస్తుందని సంజయ్‌ తెలిపారు. పార్టీలో చర్చించి చేనేతబంధు పథకంపై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసుతోపాటు అనంతరం జరిగిన వ్యవహారంపై విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేస్తామని తెలి పారు. తాము అధికారంలోకి వస్తే జర్నలిస్టుల కోసం కొత్త విధానాన్ని తీసుకొస్తామని.. అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని, రైల్వే పాసులను పునరుద్ధరించి, హెల్త్‌ కార్డులు, పింఛన్లు ఇస్తామని వివరించారు. కాగా, 3వ రోజు ప్రజా సంగ్రామ పాదయాత్రను బండి సంజయ్‌ భువనగిరి పట్టణ శివారులోని టీచర్స్‌ కాలనీ సమీపంనుంచి ప్రారంభించారు. వర్షంలో తడుస్తూనే యాత్రను కొనసాగించారు. 

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో ఊహించని పరిణామం.. రేవంత్‌కు అధిష్టానం వార్నింగ్‌!

మరిన్ని వార్తలు