పసుపుబోర్డు, గిరిజన వర్సిటీకి కేంద్ర కేబినెట్‌ ఓకే

5 Oct, 2023 03:19 IST|Sakshi

2030 నాటికి పసుపు ఎగుమతులను రూ.8,400 కోట్లకు పెంచే లక్ష్యం

గిరిజన యూనివర్సిటీ కోసం రూ.889.07 కోట్లు కేటాయింపు

తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పునః పంపిణీకి నిర్ణయం

ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని బచావత్‌–2 ట్రిబ్యునల్‌కు ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు సంబంధించి మూడు కీలక అంశాలపై బుధవారం కేంద్ర కేబి నెట్‌ నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ పసుపు బోర్డు, సమ్మక్క–సారక్క కేంద్రీయ గిరి జన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సమ్మక్క సారక్క వర్సిటీకి రూ. 889.07 కోట్లు నిధులు కేటాయించింది. ఇక తె లంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని, ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని కృష్ణా వాటర్‌ డిస్ప్యూ ట్స్‌ (బ్రిజేశ్‌) ట్రిబ్యునల్‌–2ను కేబినెట్‌ ఆదేశించింది.

ఎంతోకాలం నుంచి కొనసాగుతున్న జల వివాదాలకు ఇది ఒక పరిష్కారం చూపే అవకా శం ఉంది. తెలంగాణలో వారం రోజుల్లో ప్రధా ని వరుసగా రెండోసారి పర్యటించిన మరునాడే కేంద్ర కేబినెట్‌ ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. భేటీ అనంతరం కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, అనురాగ్‌సింగ్‌ ఠాకూర్, ఎల్‌.మురుగ న్‌ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

సమ్మక్క–సారక్క గిరిజన వర్సిటీకి రూ.889.07 కోట్లు
ఏపీ పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేంద్ర విశ్వవిద్యాలయాలు చట్టం–2009ను సవరిస్తూ పార్లమెంటులో కేంద్ర విశ్వవిద్యాలయాలు (సవరణ) బిల్లు–2023ను ప్రవేశపెట్టాలని తీర్మానించింది.

గిరిజన యూని వర్సిటీ కోసం కేంద్రం రూ.889.07 కోట్లు నిధు లు కేటాయించింది. ఈ వర్సిటీ రాష్ట్రంలో విద్యా భివృద్ధి, నాణ్యతను మెరుగుపర్చడంతోపాటు గిరిజనుల ప్రయోజనాలు, గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థ బోధన, పరిశోధనలను అందిస్తుందని.. ఉన్నత విద్య, ఆధునిక విజ్ఞానానికి సంబంధించిన మార్గాలను ప్రోత్సహిస్తుందని తెలిపింది. ప్రాంతీయ అసమతుల్యతను తొలగించడానికి తోడ్పడుతుందని వెల్లడించింది.

భారీ ఎగుమతులే లక్ష్యంగా..
దేశీయంగా పసుపు పంట, పసుపు ఉత్పత్తుల అభివృద్ధి కోసం జాతీయ పసుపు బోర్డును తెలంగాణలో ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. పసుపు వినియోగం పెంచడానికి, అంతర్జాతీయంగా మార్కెట్‌ అభివృద్ధికి ఈ చర్య తోడ్పడుతుందని తెలిపింది. దేశంలో 2022–23లో 3.24 లక్షల హెక్టార్లలో పసుపు సాగు చేయగా.. 11.61 లక్షల టన్నులు ఉత్పత్తి అయిందని తెలిపింది. బంగ్లాదేశ్, యూఏఈ, అమెరికా, మలేసి యాల్లో భారత పసుపునకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని పేర్కొంది.

జాతీయ పసుపు బోర్డుతో 2030 నాటికల్లా రూ.8,400 కోట్ల (బిలియన్‌ డాలర్ల) విలువైన పసుపు ఎగుమతులను సాధించాలన్నది లక్ష్యమని వెల్లడించింది. ఈ బోర్డుకు చైర్మన్‌ను కేంద్రం నియమిస్తుంది. ఆయుష్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, వాణిజ్య, పరిశ్రమల శాఖల నుంచి రొటేషన్‌ పద్ధతిలో రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, పరిశోధనల్లో భాగస్వామయ్యే సంస్థలు, పసుపు రైతులు, ఎగుమతిదారుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. బోర్డుకు కార్యదర్శిని కేంద్ర వాణిజ్య శాఖ నియమిస్తుంది. 

మరిన్ని వార్తలు