ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఏపీ, టీఎస్‌ మధ్య.. | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. గ్యాస్ ధర తగ్గింపు..

Published Wed, Oct 4 2023 3:39 PM

Union Minister Anurag Thakur And Kishan Reddy Briefing Cabinet Decisions - Sakshi

సాక్షి, ఢిల్లీ: దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక, బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కిషన్‌ రెడ్డి మీడియాకు కేటినెట్‌ నిర్ణయాలకు వెల్లడించారు. 

కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..
►ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని KWDT-2ట్రిబ్యునల్ కు కేంద్రం ఆదేశం. ప్రాజెక్ట్‌ల వారీగా నీటిని కేటాయించాలని ఆదేశం. 

► ఉజ్వల ‍గ్యాస్‌ సిలిండర్లపై మరో రూ.100 సబ్సిడీకి ఆమోదం. 

► సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. రూ.889 కోట్లో వర్సిటీ ఏర్పాటు.  

► తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం.  

ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన మూడు అంశాలను కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది.  పసుపు బోర్డు, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగుతుంది. పసుపు బోర్డు కోసం రైతులు ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్నారు. జాతీయ పసుపు బోర్డు కోసం రైతులు చాలా రోజులుగా పోరాటం చేశారు. ఈరోజు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 12 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి మన దేశంలో జరుగుతోంది అని అన్నారు. 

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలపై పరిష్కారం చేశాం.  విభజన చట్టం సెక్షన్-89కి లోబడే ఈ నిర్ణయం తీసుకున్నాం.  ట్రిబ్యునల్‌ ప్రాజెక్ట్‌లవారీగా నీటి కేటాయింపులను చేస్తుంది. సొలిసిటర్‌ జనరల్‌ సూచనలతో కేంద్రం చర్యలు తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రానికి గతంలో 800 టీఎంసీలు కేటాయించారు. 2013లో ట్రిబ్యునల్‌ రిపోర్టు వచ్చినా, గెజిట్‌ కాలేదు. 2015లో తెలంగాణ ప్రభుత్వం రిట్‌ పిటిషన్‌ వేసింది. తాజాగా నదీ జలాల అంశం పరిష్కారం కానుంది అని అన్నారు. 

దాదాపు 900 కోట్ల రూపాయలతో ములుగులో సమ్మక్క సారక్క సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం చేస్తాం. తెలంగాణ గిరిజనుల్లో 40 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. గిరిజనుల బాగు కోసమే ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపై పరిశోధన జరుగుతుంది. 

Advertisement
Advertisement