ఆరోగ్య అత్యవసర సేవల కల్పనకు ఎస్‌బీఐ కృషి 

3 Dec, 2021 02:18 IST|Sakshi
ఈ–కార్నర్‌ను ప్రారంభిస్తున్న చల్లా శ్రీనివాసులు

ఎస్‌బీఐ ఎండీ చల్లా శ్రీనివాసులు 

సాక్షి, హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సామాజిక బాధ్యతలో భాగంగా ఆరోగ్య అత్యవసర సేవల కల్పనకు కృషి చేస్తుందని ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఆర్‌ అండ్‌ డీబీ) చల్లా శ్రీనివాసులు అన్నారు. గురువారం ఆయన కోఠి లోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఏటీఎంతో పాటు క్యాష్‌ డిపాజిట్‌ మిషన్‌ (సీడీఎం), స్టేట్‌మెంట్‌ ప్రింటింగ్‌ మిషన్లతో కూడిన ఈ–కార్నర్‌ను ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్‌–19 నేపథ్యంలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ కింద ఎస్‌బీఐ రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ సర్వీసులను అందించాలని భావిస్తోందని, ఇందులో భాగంగా ఎంపికచేసిన ఆస్పత్రులకు అంబులెన్సులను అందిస్తున్నామన్నారు. గురువారం బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రికి ఒక అంబులెన్స్‌ను అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది రూ.2కోట్లు సీఎస్‌ఆర్‌ కింద ఖర్చు చేసినట్లు ఎస్‌బీఐ సీజీఎం అమిత్‌ జింగ్రాన్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2 కోట్లు అదనంగా ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు.  

>
మరిన్ని వార్తలు